అనుష్క అనగానే మంచి హైట్‌కు, అందానికి బ్రాండ్ అంబాసిడర్‌లా ఉంటుంది.. ఇలాంటి ఈ యోగా బ్యూటీ సినీరంగ ప్రవేశమే ఒక ఆశ్చర్యకరమైన విషయంగా చెబుతారు.. ఇదంతా పక్కనపెడితే ఈ మధ్యకాలంలో అనుష్క చాలా సఫర్ అవుతుందట.. అసలు విషయం ఏంటని ఆరా తీస్తే.. అనుష్క పెళ్లి గురించి ఎవరికి నచ్చినట్లుగా వారు మాట్లాడుకుంటున్నారట, మీడియాలో ప్రచారం చేస్తున్నారట.. టాలీవుడ్‌లో ఎంతోమంది పెళ్లికాని తారలుండగా ప్రత్యేకంగా అనుష్క గురించి విపరీతంగా ట్రోల్ చేయడం మాత్రం ఆమెకు నచ్చడం లేదనే వార్త చక్కర్లు కొడుతుంది..

 

 

ఇక ఈ గాసిప్స్ ఇప్పటివి కాదట. అనుష్క మిర్చి సినిమా చేస్తున్నప్పటి నుండి అంటే దాదాపుగా ఆరు ఏడు సంవత్సరాలుగా అనుష్క పెళ్లి పుకార్లను ఎదుర్కొంటూ ఎప్పటికప్పుడు ఆ వార్తలను కొట్టి పారేస్తూనే వచ్చింది. ఇక బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్‌, అనుష్కల వివాహం జరుగబోతుందని ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు కూడా కోడై కూశాయి. అంతటితో ఆగలేదు..

 

 

ఒక క్రికెటర్‌తో డేటింగ్‌లో ఉందని, పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. ఇదే సమయంలో రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్‌ కోవెల మూడితో అనుష్క వివాహం అంటూ కూడా ప్రచారం మొదలైంది. ఇక మరి ముఖ్యంగా విడాకుల తీసుకున్న వ్యక్తితో తన వివాహం అంటూ మీడియాలో వచ్చిన వార్తలు ఆమెకు తీవ్రంగా అసహనంకు గురి చేశాయట.

 

 

ఇలాంటి విషయాలను ఇంతకాలం చూసి చూడనట్లుగా వదిలేసిన అనుష్క ఒకగానొక సందర్భంలో తన పెళ్లి వార్తల విషయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందట. మాకు కుటుంబ సభ్యులు ఉంటారు, వారు ఇలాంటి వార్తల వల్ల సఫర్‌ అవుతారు అనే కనీస జ్ఞానం కూడా ఉండదా మీకు అంటూ ప్రశ్నించిందట... ఇక ఇప్పటి నుండైనా ఇలాంటి పుకార్లను ఆపి మీ పనులు మీరు చూసుకుంటే.. మేము చేసేపని అయినా ప్రశాంతంగా చేసుకుంటామని ఘాటుగానే చెప్పిందట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: