తెలుగు ఇండస్ట్రీలో అనుష్క పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం సూపర్ లో నటించి వెండితెరకు పరిచయం అయ్యి తన 15ఏళ్ల కెరీర్ లో సూపర్ సక్సెస్ ను సాధించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో అంచెలంచెలుగా ఎదుగుతూ.. స్టార్ హీరోయిన్‌ గా ఎదిగింది ఈమె. ఈ బ్యూటీ తన 15 సంవత్సరాల సినీ జర్నీలో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది. ఎన్నెన్నో సినిమాల్లో ఆమె నటనను నిరూపించుకుంది. ఈ సందర్భంగా ఆమె 15 ఇయర్స్ ఆఫ్ అనుష్క అను పేరుతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి, రాఘవేంద్ర రావు, పూరి జగన్నాథ్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు.

 

 

ఈ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు హాజరయిన విషయం విదితమే.. అనుష్క గురించి ఒక్కొక్కరు పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. వారిలో స్టార్ దర్శకుడు రాజమౌళి ఒకరు. రాజమౌళికి స్వీటీతో ఉన్న అనుబంధాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

 

 

రాజమౌళి అనుష్క గురించి మాట్లాడుతూ.. అనుష్క చాలా మంచి అమ్మాయని, ఆమె తనకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని తెలిపారు. స్వీటీ ప్రతీ చిన్న విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తుందని జక్కన్న అన్నారు. అసలు ఆమె కోసం బాహుబలి సినిమాలో దేవసేన పాత్రను క్రియేట్ చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు రాజమౌళి. గతంలో జక్కన్న అనుష్కతో విక్రమార్కుడు సినిమాను తెరకెక్కించారు. అయితే.. స్వీటీ ప్రతి షాట్ అలానే చేసి చుపించాలని, రొమాంటిక్ సీన్స్ కూడా యాక్ట్ చేసి చూపించమనేదని, అప్పట్లో నన్ను చాలా ఇబ్బంది పెట్టిందని అన్నాడు దర్శక ధీరుడు.

 

 

 

ఇక స్వీటీ విక్రమార్కుడు టైమ్‌ లోనే తనకు, తన ఫ్యామిలీకి చాలా క్లోజ్ అయిందని రాజమౌళి అన్నారు. అప్పటినుంచే మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయిందని తెలిపారు. కొంత మందిని ప్రేమిస్తాం.. మరికొంత మందిని ఇష్టపడతాం.. కానీ స్వీటీని మాత్రం ఒక యాక్టర్‌ గా, అలాగే ఒక మంచి మనసున్న మనిషిగా నేను చాలా గౌరవిస్తానని రాజమౌళి అన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: