ప్రస్తుతం సినిమా పరిశ్రమలో ఎప్పటికప్పుడు సరికొత్త పద్ధతులు విధానాలు రోజు రోజుకు తెరపైకి వస్తున్నాయి. సినిమాల యొక్క ప్రొడక్షన్ కాస్ట్ పెరగడంతో పాటు ఎందరో కొత్త దర్శకులు, నిర్మాతలు ఇండస్ట్రీకి వస్తూ తమ తమ టాలెంట్ ని నిరూపించుకుంటున్నారు. అలానే సినిమా కథల్లో కూడా ఒకప్పటితో పోలిస్తే ఎంతో తేడా కనపడుతోంది. ముఖ్యంగా మూస కథలకు మెల్లగా కాలం చెల్లడంతో పాటు, సరికొత్త కథ, కథనాలు యువ దర్శకులు తెరపైకి తెస్తున్నారు. దానితో పాటు ప్రేక్షకుల అభిరుచుల్లో కూడా మార్పు వస్తోంది. ఒకప్పటితో పోలిస్తే అక్కడక్కడా కొందరు ప్రేక్షకులు అయితే సినిమాలో మంచి రొమాన్స్, రొమాంటిక్ సీన్స్ వంటివి లేనిదే ఆ సినిమాలు చూడడం లేదు అనేది ఒప్పుకుని తీరవలసిన విషయం. ఇక సినిమాల్లోని హీరోయిన్ల మధ్య అయితే రోజు రోజుకు పోటీ మరింతగా పెరుగుతోంది. 

 

ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం వస్తున్న హీరోయిన్లు రెండు, మూడు సినిమాల తరువాత చాలా వరకు కనుమరుగు అయ్యే పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి. ఆ రెండు, మూడు సినిమాల్లో కూడా మంచి అందంతో పాటు నటన కనబరిస్తేనే ఆపై దర్శక, నిర్మాతలు వారి వైపు చూస్తున్నారు లేదంటే వెంటనే మరొక హీరోయిన్ ని నిర్మొహమాటంగా వెతుక్కునే పరిస్థితులు వచ్చేసాయి. అయితే ఇటీవల రెండు మంచి హిట్స్ ని, మరొక యావరేజ్ మూవీని సొంతం చేసుకున్న ఒక ప్రముఖ హీరోయిన్, మొదటి నుండి ఏ విషయాన్ని అయినా, ఏ మాత్రం మొహమాటం లేకుండా మాట్లాడుతూ ఉంటుంది. 

 

ఇక ఇటువల ఒక సినిమాలో కొంత అర్ధ నగ్న సన్నివేశాలతో దర్శనం ఇచ్చి ఫ్యాన్స్ ని పిచ్చెక్కించిన సదరు తార, తన వద్దకు వస్తున్న దర్శకులకు, తాను అర్ధ నగ్నంగా ఏంఖర్మ, పూర్తి నగ్నంగా కూడా నటించడానికి సిద్ధం అని, అయితే సినిమాలో ఆ విధంగా నటించడానికి తన పాత్ర యొక్క ఔచిత్యం దానికి తగినట్లుగా ఉండాలని, అంతేకాని ఏదో అటువంటి సీన్స్ లో డబ్బులు, క్రేజ్ కోసం నటించాలి కాబట్టి నటించలేనని షరతు పెట్టిందట. ఇక ఇటీవల ఒక దర్శకుడు ఆ తరహా కథతో ఆమె వద్దకు వెళ్లినప్పటికీ, ఆ హీరోయిన్ ఫైనల్ గా సినిమాలో తన పాత్ర అనుకున్న మేరకు లేదని దానిని రిజెక్ట్ చేసిందని టాక్. ఇక ప్రస్తుతం ఆ హీరోయిన్ ఎవరు అనే దానిపై టాలీవుడ్ లో పెద్ద చర్చే జరుగుతోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: