హీరోయిన్‌గా ఫుల్‌ ఫాంలో ఉండగానే సైజ్‌ జీరో సినిమాతో కెరీర్‌ను కష్టాల్లో పడేసుకుంది అనుష్క. ఈ సినిమా కోసం భారీగా బరువు పెరిగిన అనుష్క లుక్‌ పూర్తిగా తేడా వచ్చేసింది. దీంతో ఆమె కమర్షియల్‌ సినిమాలకు పనికిరాదని భావించారు సినీ జనాలు. అందుకు కారణం కూడా లేకపోలేదు. సైజ్‌ జీరో సినిమా తరువాత సొగ్గాడే చిన్ని నాయన సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది అనుష్క. ఆ సినిమాలో ఆమెది వయసైన పాత్ర కావటంతో పెద్దగా తేడా కనిపించలేదు. అయితే యంగ్ హీరోల సరసన ఇక ఆమె సూట్‌ అవ్వదేమో అన్న అనుమానాలు అప్పుడే కలిగాయి.

 

ఆ తరువాత నాగార్జున నటించిన ఓం నమో వేంకటేశాయ సినిమాలో కీలక పాత్రలో నటించింది అనుష్క. ఈ సినిమాలో ఆమె లుక్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపించాయి. బాగా లావైన అనుష్క లుక్‌ చూసిన ఇక ఈమె హీరోయిన్‌గా నటించటం కష్టమే అన్న అనుమానాలు కలిగాయి. ఆ తరువాత వచ్చిన సింగం 3 సినిమా అనుష్క కెరీర్‌ను మరింతగా కష్టాల్లో పడేసింది ఈ సినిమాలో గ్లామర్ హీరోయిన్ గా నటించిన అనుష్క మోడ్రన్‌ డ్రెస్సుల్లో ఆమె చాలా ఆడ్‌గా కనిపించింది. భారీ కాయంతో ఉన్న స్వీటీని తెర మీద చూసేందుకు అభిమానులు ఇబ్బంది పడ్డారు.

 

దీంతో అనుష్క కెరీర్‌కు ఫుల్‌ స్టాప్ పడినట్టే  అని అంతా భావించారు. అనుష్క కూడా లావు తగ్గేందుకు చేసిన ప్రయత్నాలన్ని విఫలం కావటంతో తానే సినిమాల నుంచి బ్రేక్‌ తీసుకుంది. అన్ని సినిమాలకు అంగీకరించ కుండా సెలెక్టివ్‌గా ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేస్తోంది. బాహుబలి 2 తరువాత భాగమతి సినిమా మాత్రమే చేసిన అనుష్క త్వరలో నిశ్శబ్ధం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాలో అయినా అనుష్క లుక్‌ అభిమానులను అలరిస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: