సూపర్‌ సినిమాతో సూపర్బ్‌ గా ఎంట్రీ ఇచ్చిన గ్లామరస్ బ్యూటీ అనుష్క శెట్టి. తొలి సినిమాలో హాట్ బ్యూటీ ఇమేజ్‌ కొట్టేసిన ఈ భామ తరువాత వరుసగా కమర్షియల్ సినిమాల్లో గ్లామర్‌ ఒలకబోసింది. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన బిల్లా సినిమాలో ఏకంగా బికినీ వేసి అందరికీ షాక్‌ ఇచ్చింది. యోగా టీచర్‌ కావటంతో అద్ధిరి పోయే ఫిగర్‌ తో బికినీలో హల్‌ చల్‌ చేసింది స్వీటీ. తెలుగుతో పాటు తమిళ సినిమాల్లోనూ హవా చూపించింది ఈ బ్యూటీ.

 

కమర్షియల్ సినిమాలు చేస్తూనే లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ ఆకట్టుకుంది అనుష్క. అరుంధతి సినిమాలో హుందాగా కనిపించి ఆకట్టుకుంది. ఈ సినిమా అనుష్క కెరీర్‌ ను మలుపు తిప్పింది. ఈ సినిమా తరువాత ఎక్కువగా లేడీ ఒరియంటెడ్ ఆఫర్లే వచ్చాయి. అనుష్క కూడా రొటీన్‌ సినిమాలను పక్కన పెట్టి ఎక్కువగా ఎక్స్‌ పరిమెంట్‌ సినిమాలతోనే ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే అదే సమయంలో ఓ సినిమా కోసం చేసిన ప్రయోగం అనుష్క కెరీర్‌ ను ఇబ్బందుల్లో పడేసింది.

 

సైజ్‌ జీరో సినిమా కోసం భారీగా బరువు పెరిగిన అనుష్క, తరువాత కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఒరియంటెడ్ సినిమాలకు కూడా దూరమైంది. ఇటీవల సినిమాలకు లాంగ్‌ గ్యాప్ ఇచ్చిన స్వీటీ త్వరలో నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాతో మరోసారి ప్రయోగం చేస్తోంది. అయితే అనుష్కసినిమా తరువాత కమర్షియల్‌ సినిమాలు చేస్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం లుక్‌ పరంగా కూడా అనుష్క కమర్షియల్‌ సినిమాలకు పనికి రాదన్న అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో స్వీటీ గ్లామర్‌ రోల్స్ చేయదేమో అని మదన పడి పోతున్నారు ఫ్యాన్స్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: