మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం క్రాక్ అనే చిత్రంతో మన ముందుకు వస్తున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసరుగా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన మాట నిజమే. కానీ డిస్కోరాజా ఫ్లాప్ అవడం వల్ల రవితేజ మార్కెట్ బాగా దెబ్బతింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఆ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో మార్కెట్ చాలా వరకు పడిపోయింది.

 

 


డిస్కోరాజా మూవీలో పీరియాడిక్ డ్రామా ఉండడంతో బడ్జెట్ కూడా బాగా పెరిగిపోయింది. ఎనభైల కాలాన్ని రీక్రియేట్ చేయడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అందువల్ల సినిమా వ్యయం మొత్తం నలభై కోట్లకి పైగా దాటింది. రవితేజ మార్కెట్ కి ఆ బడ్జెట్ ఎక్కువ కాకపోయినా వరుస వైఫల్యాలు ఎదుర్కోవడంతో మార్కెట్ చాలా వరకు దెబ్బతిని పదిహేను కోట్లకి వచ్చ్చేసింది

 

 


మార్కెట్ దెబ్బతిన్న విషయం తెలిసిన తర్వాత తన సినిమాల బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీపడట్లేదని సమాచారం. క్రాక్ సినిమా తర్వాత రవితేజ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా పీరియాడిక్ డ్రామా ఉంటుందట. అందువల్ల అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువే అవుతుందని అంచానా వేస్తున్నారు. ఆల్రెడీ పహ్లాపుల్లో ఉన్న రవితేజతో ఎక్కువ బడ్జెట్లో సినిమాలు తీస్తే నిర్మాతకి నష్టం వచ్ఛే అవకాశాలు ఎక్కువ. 

 

 

మరి రవితేజ ఏ ధైర్యంతో సినిమాని అంత బడ్జెట్ తో తీస్తున్నాడనేది అర్థం కావట్లేదు. మార్కెట్ అంతగా సహకరించనపుడూ నిర్మాతలకి సౌకర్యంగా ఉంటే బాగుంటుందని సూచిస్తున్నారు. ఇంకా డిస్కోరాజా ఫ్లాప్ అయినా కూడా రవితేజ ఏమీ నేర్చుకోలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి ముందు ముందైనా రవితేజ మారతాడా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: