తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఎంతో మంది కమెడియన్లు ఉన్నారు. అలాంటి వారిలో కొద్ది మందికి మాత్రమే మంచి గుర్తింపు ఉంటుంది.  అలాంటి వారిలో వడివేలు ఒకరు.  ప్రేమికుడు చిత్రంలో ప్రభుదేవతో కలిసి వడివేలు చేసిన కామెడీ అప్పట్లో సెన్సేషన్ అయ్యింది.  వెండి తెరపై వడివేలును చూస్తే చాలు ఒక్కసారే నవ్వుకునే స్థాయికి ఆయన తన కామెడీ మార్క్ చాటుకున్నారు.  ఆ మద్య ‘23వ హింసించే పులకేశి’ మూవీలో హీరోగా నటించి మంచి విజయం అందుకున్నాడు. అప్పట్లో వరుస చిత్రాల్లో తనదైన కామెడీ పంచుతూ హీరో స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగాడు.  తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ పై వడివేలు సెటైర్లు వేశాడు.

 

తిరుచెందూరు సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించిన వడివేలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారా..? నాకు తెలియదే అన్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదని, చివరికి ఆయనక్కూడా ఆ విషయం తెలియదని ఎద్దేవా చేశారు.  రాజకీయాలు అంటే ఇప్పుట్లో అంత సామాన్య విషయం కాదని.. ఇప్పటికే సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వచ్చి ఎన్ని ఇక్కట్టు పడ్డారో ప్రతి ఒక్కరికీ తెలుసు అని అన్నారు.  సినీ ప్రపంచం వేరు.. రాజకీయాలు వేరు..  గతంలో సినీ నటులు రాజకీయాల్లోకి వచ్చారంటే వారిపై ప్రజలకు ఉన్న అభిమానం వేరు.

 

అందుకే వారు ఎంతో కాలం నాయకులుగా ప్రజలకు సేవ అందించారు.. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి వేరు అన్నారు.  అయితే, పార్టీకి ఓ నాయకత్వం, పాలనకు మరో నాయకత్వం ఉంటుందన్న రజనీ సిద్ధాంతాన్ని మాత్రం తాను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. విచిత్రం ఏంటంటే.. తనకు కూడా సీఎం కావాలని ఉందని.. తాను పోటీ చేస్తే మీరు ఓటు వేస్తారా అని విలేకరులను అడిగారు.  దాంతో తాము వేస్తామని చెప్పడంతో... ఓహో తాను సీఎం కావడం పక్కా అన్ని నవ్వారు.  అయతే తాను మాత్రం ప్రజలంతా చల్లగా ఉండాలి.. ఆయురారోగ్యాలతో ఉండాలని  స్వామి వారిని దర్శించుకున్నట్టు వడివేలు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: