అరుంధతి... టాలీవుడ్ స్వీటి అనుష్క... కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ హిట్. ఆ సినిమాకు ముందు అనుష్కసినిమా తర్వాత అనుష్క అనే విధంగా ఆమె పేరు తెచ్చుకుంది. ఆ సినిమాలో ఆమె నటనకు అభిమానులే కాదు తెలుగు సినీ పరిశ్రమ ఫిదా అయిపోయింది. అనుష్క అంటే అప్పటి వరకు గ్లామర్ అనుకున్న వాళ్ళు అందరూ కూడా అనుష్కలో ఆ యాంగిల్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు కూడా. ఆ స్థాయిలో ఆ సినిమా విజయం సాధించింది. ఆ తర్వాత అనుష్క తన కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు అనేది వాస్తవం. 

 

టాలీవుడ్ లో అనుష్కకు పోటీగా ఎంత మంది హీరోయిన్స్ వచ్చినా సరే అనుష్క ప్లేస్ ని మాత్రం ఎవరూ భర్తీ చేయలేకపోయారు అనేది అర్ధమైంది. అరుంధతి సినిమా అనేది ఒక సాహసం. ఆ సినిమా చూసిన ఎవరికి అయినా సరే అదే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. అలాంటి సినిమా చెయ్యాలి అంటే కెరీర్ మొదట్లో గట్స్ ఉండాలి. కాని అనుష్క ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ఆ సినిమాను పూర్తి చేసింది. ఆ సినిమాలో తన నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకుంది అనుష్క. ఆ సినిమా తర్వాత ఆమె పారితోషికం కూడా భారీగా పెరిగింది. 

 

అలాంటి సాహసోపేతమైన సినిమాకు అనుష్క సరిగా సరిపోతుందని కోడి రామకృష్ణ కు సూచించింది టాలీవుడ్ దిగ్గజ దర్శక నిర్మాత అయిన దాసరి నారాయణ రావు. ఆ సినిమాకు ఆమె మినహా ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్నా ఏ హీరోయిన్ కూడా సరిపోయే అవకాశం లేదని కాబట్టి రెండో ఆలోచన లేకుండా ఆమెను ఆ సినిమాకు తీసుకోవాలని దాసరి చెప్పారట. సినిమా అనుకున్నది అనుకున్నట్టు రావాలి అంటే అనుష్క అయితే కరెక్ట్ అని దాసరి చెప్పడంతోనే కోడి రామకృష్ణ ఆమెతో సినిమా తీసారట.

మరింత సమాచారం తెలుసుకోండి: