సినిమా హీరోల గురించి హీరోయిన్ ల గురించి ఏదైనా చిన్న వార్త వస్తే చాలు మీడియా చేసే గోల అంతా ఇంతా కాదు. వాళ్ళు ఆలోచనలను కూడా మీడియా నే చెప్పేస్తూ ఉంటుంది. దీని ద్వారా వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉందని కూడా కనీసం ఆలోచించే ప్రయత్నం చేయరు జనాలు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరింతగా రెచ్చిపోతున్నారు కొందరు. ఇష్టం వచ్చినట్టు కథనాలు రాస్తున్నారు. ఏ సినీ పరిశ్రమలో అయినా సరే ఇదే విధంగా కథనాలు రాస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటారు కొందరు. దీని వలన వచ్చే ఇబ్బందులు ఏంటీ అని కూడా ఆలోచించే ప్రయత్నం చేయరు. 

 

ఇది పక్కన పెడితే టాలీవుడ్ లో అనుష్క విషయంలో కొందరు చాలా అతి చేసారు. ప్రధానంగా ఆమెకు అక్కినేని నాగార్జున కు అఫైర్ ఉందీ అనే వార్తలు ఆమెను బాగా ఇబ్బంది పెట్టాయి. ఈ వార్తలు చూసి ఆమె కన్నీళ్లు కూడా పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయని అంటారు. ఆమెతో కలిసి నాగార్జున రెండు మూడు సినిమాలు చేసారు. ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఆమె కోసమే నాగార్జున సినిమాలు చేస్తున్నారని వార్తలు రాసారు. దీనితో అనుష్క చాలా ఇబ్బంది పడ్డారు. అక్కినేని నాగేశ్వరరావు మరణించిన సమయంలో కూడా ఇదే విధంగా కథనాలు రాశారు. 

 

నాగార్జున తో ఆమెకు ఉన్న స్నేహం కారణంగా ఆమె కార్యక్రమం అయ్యే వరకు అక్కడే ఉన్నారు. దీనికి మీడియా రాసిన రాతలు అన్నీ ఇన్ని కావు. అప్పుడే సోషల్ మీడియా ఊపందుకుంది. పత్రికల్లో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని వార్తలు రాసారు. కొన్ని టీవీ చానల్స్ అయితే అనుష్క అక్కడ ఎందుకు అంటూ రాతలు రాసాయి, కథనాలు ప్రసారం చేసాయి. వీటితో అనుష్క మానసికంగా నరకం చూసారని, అందుకే నాగార్జున కు ఆమె దూరం జరిగారని కొందరు అంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: