దక్షిణాదిలో గత దశాబ్దం కాలంగా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్స్ లో అనుష్క ఒకరు. చాలా మంది స్టార్ హీరోయిన్స్ ని ఆమె పక్కకు నెట్టారు. దాదాపు అందరు అగ్ర హీరోలతో తెలుగు తమిళ భాషల్లో ఆమె సినిమాలు చేస్తూ వచ్చారు. ఆమె కోసం కొందరు హీరోలు ఎదురు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అనుష్క కెరీర్ లో రెండు భాషలలోను మంచి హిట్స్ వచ్చాయి. తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ ని ఆమె తక్కువ కాలంలో సంపాదించుకుని చాలా మందికి సవాల్ చేసింది. ఆ విధంగా తన ముద్ర వేసింది. 

 

అయితే ఆమెను తమిళ సినీ పరిశ్రమ పెద్దలు బాగా ఇబ్బంది పెట్టారని అంటారు. సూర్య తో చేసిన ఒక సినిమా ఫ్లాప్ అయింది. ఆ సినిమా ఫ్లాప్ అవడానికి కారణం అనుష్క అంటూ ప్రచారం చేసారు కొందరు. దీనితో ఆమె పైకి చెప్పుకోలేని విధంగా బాధపడింది. ఆ తర్వాత అక్కడ ఆఫర్లు వచ్చినా సరే వద్దని ఆమెకు పక్కకు వచ్చేసింది అని చెప్తారు. టాలీవుడ్ లో ఆమెకు మంచి ఆఫర్లు వచ్చినా సరే అక్కడ ఉన్న పరిచయాలతో ఆమె ఎక్కువగా సినిమాలు అక్కడ చేసింది. కొంత మంది హీరోలు ఆమెను చెయ్యమని కోరారు. 

 

దీనితోనే ఆమె అక్కడ ఎక్కువగా సినిమాలు చేసింది. పారితోషికం ఎక్కువ అడుగుతుందని, ఆమె అందరి హీరోల పక్కన చెయ్యదని, ఆమెకు లెవెల్ ఎక్కువ అని అక్కడ కొందరు ఎక్కువగా ఆమెను టార్గెట్ చేస్తూ వచ్చారు. దీనితో అనుష్క వారి విషయంలో కొన్ని సందర్భాల్లో సీరియస్ అయింది. అందుకే తెలుగు సినిమాలను ఆమె తమిళంలో కూడా వద్దని తన సినిమాలను తమిళ నిర్మాతలు చూడనివ్వరు అంటూ ఆమె కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యలు కూడా చేసినట్టు సమాచారం. తమిళం ఆమెను వద్దని చెప్పిందో ఆమె తమిళాన్ని వద్దని చెప్పిందో తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: