హీరోయిన్లు కాస్త హాట్ గా ఉండ‌డం అనేది స‌ర్వ సాధార‌ణం. అయితే చాలా కాలం నుండి కేవ‌లం సినిమాల్లో మాత్ర‌మే కాకుండా బ‌య‌ట కూడా ఎక్స్‌పోజ్ చేసే డ్ర‌స్సులే వేసుకుంటూ తిరిగేస్తున్నారు ఈ భామ‌లు. క‌రోనా వ‌స్తుంద‌న్న భ‌యంతో పూజా హెగ్డే చేతుల‌కి గ్లౌజెస్‌.. మొహానికి మాస్క్ అయితే క‌ట్టిందికాని పైన ఒక టీష‌ర్టు వేసి వ‌దిలేసింది. కింద ప్యాంట్ వెయ్య‌లేదు. దీంతో కొంత మంది సోష‌ల్ మీడియాలో ఈ భామ పై కామెంట్లు మొద‌లు పెట్టారు. ఇక ప్ర‌పంచం మొత్తం గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న ప్రాణాంత‌క వ్యాధి క‌రోనా. ఒకేసారి సామాన్యుల నుంచి సెల‌బ్రెటీల వ‌ర‌కు హ‌డ‌లెత్తించేస్తుంది ఈ వ్యాధి. ఎక్క‌డికి వెళితే ఏం జ‌రుగుతుందోన‌ని జ‌నాలు భ‌య‌భ్రాంతుల‌కు గుర‌వుతున్నారు. షూటింగ్ ప‌నుల మీద కొంత మంది సెల‌బ్రిటీలు ఫారిన్ వెళ్లాలంటేనే భ‌యంతో వ‌ణికిపోతున్నారు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా త‌మ ప్ర‌యాణాల‌ని సైతం వాయిదా వేసుకుంటున్నారు. కొంత మంది స్టార్స్ షూటింగ్‌ల‌ని అర్థాంత‌రంగా ర‌ద్దు చేసుకుని మ‌రో చోట షూటింగ్ చేయాల‌ని నిర్ణ‌యించుకుంటున్నారు. లేదా కొన్ని రోజుల‌కి షూటింగ్‌ల‌ని వాయిదా వేయాల‌ని నిర్ణ‌యించుకుంటున్నారు.

 

ఇదిలా వుంటే ప్ర‌భాస్ టీమ్ మాత్రం `జాన్‌` సినిమా కోసం ఏకంగా జార్జియాకే వెళ్లింది. అక్క‌డ ఇప్ప‌టికే ఓ ఛేజింగ్ సీన్‌ని పూర్తి చేసి మేజ‌ర్ షూటింగ్‌కు రెడీ అయిపోతోంది ఈ టీమ్‌. అయితే ఇక్క‌డ అస‌లు చిక్కు ఎక్క‌డ వ‌చ్చిందంటే... పూజ హెగ్డేకి సంబంధించిన కీల‌క స‌న్నివేశాల‌ని కూడా అక్క‌డే ప్లాన్ చేశార‌ట‌. దీంతో పూజా టీమ్‌తో క‌లిసి జార్జియాకి ప‌య‌న‌మైంది. ఇస్తాంబుల్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న పూజా ఇన్‌స్టాలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన ఫొటోని పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో మూతికి మాస్క్‌, చేతుల‌కి గ్లౌస్‌, కాళ్ల‌కి షూస్ ధ‌రించి క‌నిపిస్తోంది.

 

`సినిమాలంటే ప్రేమ‌. అందుకే జార్జియా వ‌చ్చాను అని పూజా పెట్టిన పోస్ట్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. పూజా డెడికేష‌న్, ప్రొఫెష‌న‌లిజ‌మ్ చూసి నెటిజ‌న్లు పాపం పూజాహేగ్డేకి ఏంటీ ప‌రిస్థితి? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు బాధ‌ప‌డుతున్నారు. ఇక పూజా చేతిలో చాలా చిత్రాలే ఉన్నాయి ప్ర‌స్తుతం అన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్‌గా న‌టిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: