అనుష్క... దక్షిణాది భాషల్లో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్. తమిళం, తెలుగు, మలయాళ౦ భాషల్లో ఆమె ఎందరో స్టార్ హీరోలతో విజయవంతమైన సినిమాలు చేసింది. ఇతర భాషల్లో ఏమో గాని తెలుగులో మాత్రం ఆమె చాలా మంది హీరోలతో చేసింది. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వెళ్ళింది అనుష్క. ఇదే సమయంలో ఆమెకు బాలీవుడ్ ఆఫర్లు కూడా భారీగా వచ్చాయని చెప్తూ ఉంటారు. బాలీవుడ్ అగ్ర దర్శకులు ఆమెను అరుంధతి సినిమా తర్వాత సంప్రదించి చర్చలు జరిపినా ఆమె మాత్రం అందుకు ఇష్టం చూపించలేదని అంటారు. 

 

ఏ మాటకు ఆ మాట అనుష్క కు టాలీవుడ్ లో హీరోతో సమానంగా గుర్తింపు వచ్చేసింది. దీనితో అనుష్కకు టాలీవుడ్ లో ఫాన్స్ ఎక్కువ. తమిళంలో కూడా దాదాపుగా అంతే. అనుష్క సినిమా అంటే ప్రత్యేకంగా చూసే జనాలు కూడా ఉన్నారు. కానీ బాలీవుడ్ లో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటాయి పరిస్థితులు. హీరోయిన్ ఎవరు అయినా సరే హీరో కి ఉండే క్రేజ్ తోనే సినిమా నడుస్తుంది. ఒకరిద్దరు హీరోయిన్స్ మినహా అక్కడ ఎవరూ పెద్దగా ఫాన్స్ ని కలిగి లేరు. దానికి తోడు హీరోయిన్స్ చెప్పింది అక్కడ జరిగే పరిస్థితి కూడా ఉండదు. 

 

దీనితోనే అనుష్క బాలీవుడ్ ని వద్దనుకుంది అంటారు. ఆమెకు తెలుగులో లేడీ సూపర్ స్టార్ గా ఇక్కడి సినిమాలతో గుర్తింపు బాగానే వచ్చిందని అక్కడి సినిమాల తో తాను తగ్గి నటించాలని అందుకే ఆమె బాలీవుడ్ కి ఎప్పుడూ దూరంగా ఉందని అంటారు. అగ్ర దర్శకులు వచ్చి ఆమెను సంప్రదించినా సరే ఆమె వద్దని చెప్పింది అంటారు. టాలీవుడ్ లో తాను అడిగింది ఇస్తారని బాలీవుడ్ లో వాళ్ళు చెప్పింది తాను తీసుకోవాలని, రెండు పడవల మీద కాళ్ళు అసలు అవసరం లేదని, తన కెరీర్ బాగానే ఉందని అనుష్క భావించింది అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: