ఏ సినీ పరిశ్రమలో అయినా సరే హీరోయిన్ ఒక రేంజ్ కి వెళ్ళింది అంటే చాలు ఆమె మీద వచ్చే వార్తలు అన్నీ ఇన్నీ కావు. వరుస ఆఫర్లతో దూసుకుపోయే హీరోయిన్ గురించి మీడియా కాస్త అతి చేస్తూ ఉంటుంది. అందరితోను ఆమెకు ఆఫైర్లు అంట గట్టె ప్రయత్నం చేస్తూ ఉంటుంది మీడియా. చాలా మంది హీరోయిన్లు మీడియా వలన ఎక్కువగానే ఇబ్బందులు పడ్డారు. అయినా సరే  మీడియా మాత్రం చెయ్యాల్సింది చేస్తూ ఉంటుంది. దీనిపై విమర్శలు వచ్చినా ప్రేమ వ్యవహారాల్లో మీడియా వేలు పెడుతూనే ఉంటుంది అనేది వాస్తవం. 

 

టాలీవుడ్ లో ఈ తరం లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ లో అనుష్క విషయంలో కూడా ఇదే విధంగా మీడియా అనేక కథనాలు రాసింది. ఆమె ఎవరినో ప్రేమిస్తున్నారని ఆ విషయాలు బయటకు చెప్పడం లేదని, విదేశీ వ్యక్తితో ఆమె ప్రేమలో ఉందని అంటారు. అదే విధంగా ఆమె ఒక కెమెరా మెన్ తో ప్రేమలో ఉందని కూడా అన్నారు. ఆ తర్వాత ప్రభాస్ తో ఆమె ప్రేమలో ఉందని, పెళ్లి అయిన స్టార్ హీరోతో ఆమె ప్రేమలో ఉందని, ఎవరికి తోచిన కథనాలు వాళ్ళు రాసారు. కాని అనుష్క మాత్రం ఎప్పుడూ కూడా నోరు జారలేదు. 

 

ఆమె ఎక్కడా కూడా లూజ్ టాక్ తో ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఆమెకు ప్రేమ వ్యవహారాలు ఎక్కువని మాట్లాడారు. దాని గురించి ఎప్పుడూ ఆమె సహనం కోల్పోయి మాట్లాడలేదు. ఇటీవల క్రికెటర్ తో ఆమె ప్రేమలో ఉన్నారని కార్ పంపించారు అని ఎవరికి తోచిన వ్యాఖ్యలు వాళ్ళు చేసినా సరే ఆమె మాత్రం ఎక్కడా హుందా తనం కోల్పోయి మాట్లాడలేదు. అలాగే అగ్ర దర్శకుడు తో పెళ్లి సహజీవనం అన్నా గాని ఆమె ఎక్కడా హుందాతనం కోల్పోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: