బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్‌ ఆర్యన్‌కు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఫాలోయింగ్‌ ఉంది. తన సినిమా అప్‌డేట్స్‌ తో పాటు ఎప్పటికప్పుడు తన పర్సనల్‌ లైఫ్ కు సంబంధించిన విశేషాలను కూడా సోషల్ మీడియాలో షేర్‌ చేస్తుంటాడు కార్తీక్ ఆర్యన్‌. తాజాగా కార్తీక్ ఆర్యన్‌ తన లేటెస్ట్‌ ఫోటోనే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఫోటోకు సంబంధించి ఇంట్రస్టింగ్ కామెంట్ చేశాడు ఓ అభిమాని.

 

కామెంట్‌ సెక్షన్‌ లో అభిమానుల కార్తీక్ ఆర్యన్‌ ను ఆకాశానికి ఎత్తేస్తూ కామెంట్లు చేశారు. అయితే ఆ కామెంట్స్‌ లో ఒక్కటి ఈ యంగ్ హీరో దృష్టిని ఆకర్షించింది. కార్తీక్‌ ఆర్యన్‌ ను భాయ్‌ అని పిలుస్తూ ఓ మహిళా అభిమాని `భాయ్‌ నేను నీకు లక్ష రూపాయలు ఇస్తాను, ఈ చెల్లికి రిప్లై ఇవ్వు` అంటూ కామెంట్ చేసింది. దీంతో కార్తీక్‌ ఫోటోతో పాటు ఆ అభిమాని కామెంట్‌ కూడా వైరల్‌గా మారింది.
IHG

 

ఈ కామెంట్‌ మీద స్పందించిన కార్తీక్‌.. `ఇదుగో రిప్లై.. మరి నా డబ్బు ఏదీ` అంటూ రిప్లై ఇచ్చాడు. తన అభిమాన నటుడు ఇచ్చిన ఈ ఫన్నీ రిప్లైకి ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం కార్తీక్‌ ఆర్యన్‌ రాజస్థాన్‌లో చిత్రీకరణలో ఉన్నాడు. భూల్‌ భులయ్యా కు సీక్వెల్‌ గా తెరకెక్కుతున్న ఈ కామెడీ హరర్‌ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు దోస్తానా 2లోనూ నటిస్తున్నాడు కార్తీక్‌ ఆర్యన్‌.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

“Jesse, you asked me if I was in the meth business, or the money business… Neither. I’m in the empire business.”

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on

మరింత సమాచారం తెలుసుకోండి: