ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ భయాందోళనలకి గురి చేస్తున్న కరోనా వైరస్ ఇండియాకి కూడా వచ్చిందన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా లక్షకి మందికిపైగా సోకి ఈ వైరస్ సుమారు 127 దేశాలకి పాకిందని సమాచారం. మన ఇండియాలో దాదాపు డెభ్భైకి పైగా మందికి ఈ వ్యాధి వ్యాపించిందని వార్తలు వస్తున్నాయి. అలాగే ఇండియాలో నిన్న మొదటి కరోనా మరణం సంభవించిందని వార్తలు వచ్చాయి.

 

 

ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ప్రాణాలని బలిగొంటున్న ఈ మహమ్మారి వల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయి. జనాలు బయటకి వెళ్లక్పోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతున్నాయి. కరోనా ప్రభావం ఎన్నో పరిశ్రమల మీద పడింది. దానికి సినిమా రంగం కూడా అతీతం కాదు. కొన్ని రోజుల పాటు థియేటర్లని మూసివేయడం దగ్గరనుండి ఇతర దేశాల్లో గల తమ షూటింగ్ లని వాయిదా వేసుకుంటున్నారు.

 

 


అయితే ఇందులో ఆర్.ఆర్.ఆర్ కూడా చేరే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఆర్.ఆర్.ఆర్ తర్వాతి షెడ్యూల్ కోసం పూణె వెళ్లాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల ప్రకారం షూటింగ్ జరుగుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో కరోనా గురించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు మునుపటి వలే అన్ని ప్రదేశాలలో ఇవ్వకపోవచ్చు. 

 

 

వందల మంది స్టాఫ్ పాల్గొనే ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ సినిమాల షూటింగ్స్ లో సరైన భద్రతా నియమావళి పాటించకుండా షూటింగ్ జరిగితే ఏదైనా ప్రమాదం జరిగితే తీవ్ర ఇబ్బందులు తలెత్తవచ్చు. మరి వీటన్నింటి దృష్ట్యా సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. అదే జరిగితే అనుకున్న తేదీకి విడుదల అవుతుందా లేదా అన్నది కూడా సందేహంగానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: