టాలీవుడ్ లో అల్లు అర్జున్, మహేష్ బాబు ఇద్దరూ దూకుడు ఉన్న హీరోలే. ఇద్దరు స్టార్ హీరోలు కావడమే కాకుండా పెద్ద ఫ్యామిలీల నుంచి వచ్చిన హీరోలు కూడా. దీనితో వీరికి మంచి గుర్తింపే ఉంది. ఇక ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగా ఉన్న హీరోలు ఈ ఇద్దరు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇద్దరూ ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా తర్వాత మంచి హిట్ కొట్టాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా పలు రికార్డులను కూడా బద్దలు కొట్టింది. 

 

ఇక మహేష్ ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ కొట్టినా అల్లు అర్జున్ సినిమానే సూపర్ హిట్ అన్నారు . అయితే ఇక్కడ మహేష్ బాబు ని అల్లు అర్జున్ కావాలి అనే టార్గెట్ చేస్తున్నాడు అంటున్నారు. మహేష్ బాబు విడుదల చేసే సినిమాల సమయంలో మరో సినిమా ఉండటం లేదు. దీనితో భరత్ అను నేను, మహర్షి సినిమాలు సూపర్ హిట్ లు అయ్యాయి. మహేష్ సినిమా రికార్డులు కూడా కొందరు హీరోలు సాధించడం లేదు. దీనితో ఇప్పుడు తాను మహేష్ కి గట్టి పోటీ అవ్వాలని చూస్తున్నాడట. 

 

సుకుమార్ దర్శకత్వంలో చేసే సినిమాను కూడా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది విడుదల చెయ్యాలని చూస్తున్నాడు. మహేష్ బాబు కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చెయ్యాలని చూస్తున్నాడు. దీనితో ఈ ఇద్దరి సినిమాలపై ఇప్పుడు పెద్ద చర్చలే జరుగుతున్నాయి. మరి ఈ సినిమాలు ఏ విధంగా ఆకట్టుకు౦టాయో చూడాలి. అసలు అల్లు అర్జున్ అతని రికార్డులను టార్గెట్ చేసాడా లేక మరేదైనా కారణం ఉందా అనే దాని మీద ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: