జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాల మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల లోపు ఎక్కువ సినిమాలు చెయ్యాలని ఆయన లక్ష్యంగా పెట్టుకుని మరీ చేస్తున్నారు. ప్రస్తుతం వకీల్ సాబ్ అనే సినిమాలో చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే మరో సినిమాలో ఆయన నటించే అవకాశాలు కనపడుతున్నాయి. టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న కొందరు అగ్ర దర్శకులతో ఆయన సంప్రదింపులు ఎక్కువగా జరుపుతున్నారు. క్రిష్ టాప్ దర్శకుడే. ఆయనతో చేసే సినిమా పూర్తి కాగానే ఎవరితో సినిమా చెయ్యాలి అనే దాని మీద ఎక్కువగా కసరత్తులు చేస్తున్నారు. 

 

ఆ తర్వాత తన సినిమాను త్రివిక్రమ్ తో చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాడట. త్రివిక్రమ్ తో ఇప్పటికే పవన్ మాట్లాడినట్టు సమాచారం. క్రిష్ తో సినిమా అవ్వగానే సినిమా మొదలు పెట్టాలని ప్లాన్ లో ఉన్నట్టు సమాచారం. ఎలాగూ అప్పటికి ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేసే సినిమా అయిపోతుంది కాబట్టి ఈ సినిమాను లైన్లో పెట్టే ప్లాన్ చేస్తున్నాడట పవన్. వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో ఉండగానే క్రిష్ తో చేస్తున్నాడు. ఎన్టీఆర్ సినిమా అవ్వగానే త్రివిక్రమ్ తో మొదలుపెట్టే విధంగా ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాను కాస్త కొత్తగా ఫ్యాక్షన్ కోణంలో ఉండే విధంగా చూడాలని చెప్పాడట. 

 

రాజకీయం చుట్టూ తిరిగే విధంగా ప్లాన్ చెయ్యాలని చెప్పినట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేసే సినిమా మార్చ్ కి పూర్తి అవుతుంది. అప్పటికి క్రిష్ తో పవన్ చేసే సినిమా కూడా పూర్తి అవుతుంది. వేసవిలో త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా వస్తుంది. ఆ సినిమా షూటింగ్ లో ఉండగానే మంచి రోజు చూసుకుని కొబ్బరికాయ కొట్టే ప్లాన్ చేస్తున్నాడట పవన్. మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: