టెంపర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ కి వరుసగా హిట్స్ పడుతున్న విషయం తెలిసిందే.  జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత తర్వాత ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్నాడు.  గతంలో రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ తర్వాత ఇప్పుడు నాలుగో సినిమాకు సిద్దమయ్యాడు.  ఈ మూవీలో మరో హీరో రామ్ చరణ్ నటిస్తున్నారు.  మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  అయితే ఈ మూవీలో లో తెలంగాణ మన్యం వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్,  ఆంధ్ర మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతారని ఆ మద్య దర్శకులు రాజమౌళి తెలిపారు. 

 

ఆ మద్య ఎన్టీఆర్ కొమురం భీమ్ లుక్ లీక్ అయిన విషయం తెలిసిందే.  ఇందులో పులితో పోరాడుతున్నట్లు ఉన్న ఫోటో, జనాలతో మాట్లాడుతున్న ఫోటోలు లీక్ అయ్యాయి.  ఎన్టీఆర్ - చరణ్ అభిమానులు ఈ సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఆసక్తిని చూపుతున్నారు.  కాగా, ఈ సినిమాలో ఆయన కొమరం భీమ్ గెటప్పులోనే కాకుండా, కథా పరంగా మరో రెండు గెటప్పుల్లో కనిపించనున్నట్టు తాజా సమాచారం. ఆ రెండు గెటప్పులు .. వాటి తాలూకు సన్నివేశాలు ఉత్కంఠభరితంగా వుంటాయని అంటున్నారు.

 

ఇప్పటికే కొమురం భీమ్ గా తలపాక చుట్టిన ఫోటో ఒకటి లీక్ అయ్యింది. మరి రెండో పాత్ర ఎలా ఉండబోతుందో అని ఫ్యాన్స్ కి కుతూహలం మొదలైంది.  ఈ మూవీ షూటింగ్ షరవేగంగా జరుగుతుంది.  సంక్రాంతి వరకు పూర్తి చేసి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్ర యూనిట్.  కాకపోతే ఇప్పటి వరకు రామ్ చరణ్ కి సంబంధించి ఏ ఒక్క అప్ డేట్ కూడా లేదు.. అయితే రామ్ చరణ్ లుక్ ఎలా ఉండబోతుందో అన్న ఆలోచనలో ఫ్యాన్స్ ఉన్నారు.  ఏది ఏమైనా ఆర్ఆర్ఆర్ తో రాజమౌళి మరో సంచలనం సృష్టించడం ఖాయం అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: