మెగాస్టార్ టాలీవుడ్లో బలమైన పిల్లర్. ఆయనది నాలుగు దశాబ్దాల చరిత్ర. ఆయన లివింగ్ లెజెండ్. ఆయన వారసులు ఇండస్ట్రీలో డజన్ మంది దాకా హీరోలుగా  ఉన్నారు. చిరంజీవిని దాటుకుని ఇప్పటిదాకా ఏ టాలీవుడ్  హీరో ముందుకెళ్ళలేదు. పోటీ ఇచ్చినా కూడా అది నామమాత్రమే. ఇక మెగా క్యాంప్ హీరోల ఇమేజే వేరు. వారు తెలుగు రాష్ట్రాల  జనాలకు ఆరాధ్య దైవాలుగా ఉన్నారు.

 

 

అందుకే మెగా క్యాంప్ జోలికి ఏ హీరో వెళ్ళడు. అటువంటి మెగా క్యాంప్  విషయంలో ఎంతో ధిక్కారం చూపించి త్రిష బయటకు వచ్చేసింది. ఇది  టాలీవుడ్లోనే పెద్ద చర్చగా ఉంది. త్రిష విషయం తీసుకుంటే గ్లామర్ క్వీన్. ఆమెకు  పదిహేనేళ్ళ కెరీర్ ఉంది ఆమెకు హిట్లు ఎన్నో ఉన్నాయి. అలాగే ఫట్లూ ఉన్నాయి.

 

 

ఇపుడు ఆమె కెరీర్ డౌన్ ఫాల్లో ఉంది. సరైన అవకాశాలు లేవు. అయినా కూడా త్రిష మెగా క్యాంప్ ని కాదని బయటకు రావడం అంటే ఆమెకు సొగసే కాదు ఎంత పొగరు అన్న మాట కూడా వినవస్తోంది. త్రిష మెగాస్టార్ పక్కన కనిపిస్తే ఆమె కెరీర్ కి హెల్ప్ గా ఉంటుందని అంతా అనుకుంటున్న వేళ ఆమె నాకు ఈ మూవీయే అక్కరలేదు అంటూ వెనక్కిపోవడాన్ని మాత్రం మెగా ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారుట.

 

 

సోషల్ మీడియా వేదికగా త్రిషను టార్గెట్ చేస్తున్నారు. త్రిషకు ఎంత పొగరు అంటూ ఘాటు కామెంట్స్  పెడుతున్నారు. అయినా త్రిషకు ఖాతరు లేదు. మళ్ళీ తెలుగులోకి వస్తా, అందరినీ పలకరిస్తా అంటూ మెసేజ్ పెట్టడం కూడా పుండు మీద కారం చల్లినట్లుగా ఉందిట. ఏది ఏమైనా త్రిష లేడీ హీరోయిన్ కాదు హీరోనే  అంటున్న వారూ ఉన్నారు.

 

 

త్రిషకు ఈ మూవీలో మొదట కధ చెప్పినపుడు పాత్ర వేరుగా  ఉందిట. ఇపుడు మాత్రం ఆమె క్యారక్టర్ బాగా కట్ అయిపోయిందట. ఈ మూవీలో చిరంజీవి ఆడేందుకు పాడేందుకు రెజీనా ఉంది. ఇక చరణ్ ఈ మూవీలో ఒక కీలకమైన పాత్రలో కనిపిస్తున్నాడు. దాంతో ఆయన పక్కన హీరోయిన్ ఉంది. వారికి రెండు డ్యూయెట్లు ఉంటాయట. మొత్తానికి సీన్లు సరైనవి లేక, సాంగులు లేక చిన్న పాత్రగా త్రిష కనిపిస్తుందట. ఈ మాత్రం భాగ్యానికి ఈ మూవీ ఎందుకు అంటూ తిప్పికొట్టిందని మరో టాక్. మొత్తానికి త్రిష మెగా క్యాంప్ ఇగోని బాగా  హర్ట్ చేసింది. ఇదే తొలిసారి కావడంతో మెగా క్యాంప్ తట్టుకోలేకపోతోందిట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: