నందమూరి ఫ్యామిలీ హీరోగా తెరంగేట్రం చేసిన కళ్యాణ్ రామ్ డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ కెరియర్ సాగిస్తున్నారు. హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా సరే కళ్యాణ్ రామ్ ఇప్పటి వరకు కరెక్ట్ హిట్ పడలేదని చెప్పాలి. అతనొక్కడే, పటాస్, 118 ఇలా వేళ్ళ మీద లెక్కబెట్టే సినిమాలు హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ప్రస్తుతం కొత్త కథలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ ఇయర్ వచ్చిన ఎంతమంచి వాడవురా నిరాశపరచగా ప్రస్తుతం ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక లేటెస్ట్ గా ఒక సినిమా అనుభవం ఉన్న దర్శకుడు కొటెంద్ర కళ్యాణ్ రామ్ కోసం ఒక కథ సిద్ధం చేశారట. 

 

కథ బాగా నచ్చడంతో డైరెక్టర్ కు కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది. బంగారి బాలరాజు సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చాటిన కోటి సెకండ్ ప్రాజెక్ట్ నందమూరి హీరోతో చేస్తాడని ఫిల్మ్ నగర్ టాక్. కథ కథనాలు చాలా కొత్తగా ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం డిస్కషన్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందట. 

 

నందమూరి ఫ్యాన్స్ అండ దండలు ఉన్నా కరెక్ట్ సినిమా పడక కెరియర్ లో వెనుకపడుతున్న కళ్యాణ్ రామ్ ఇక మీదట కథల విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాడని తెలుస్తుంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ కోటి చెప్పిన కథ నచ్చడంతో ఓకే చెప్పారట. ఈ సినిమాను ప్రముఖ బ్యానర్ నిర్మిస్తుందని అంటున్నారు. సినిమా ఎనౌన్స్ మెంట్ రోజే టైటిల్ కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసి బజ్ క్రియేట్ చేసే ఆలోచన లో ఉన్నారు దర్శక నిర్మాతలు. మరి కళ్యాణ్ రామ్ ఏరి కోరి మరి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ అతనికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: