బాలీవుడ్ సినిమా అంటే చాలు హీరోయిన్లకు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. లార్జ్ స్కేల్ సినిమాలతో కెరీర్ మరో స్టేజ్ కు వెళ్తుందని కలల్లోకి వెళ్లిపోతారు. కానీ బాపుగారి బొమ్మకు మాత్రం ఆ ఆనందం ఎక్కడా కనిపించడం లేదు. ఈ సినిమా పరిస్థితి ఏంటో అనే దిగులు కనిపిస్తోంది. మరి బాలీవుడ్ కు వెళ్లినా బాధలు తప్పలేదనే సిట్యువేషన్ లో ఉన్న లేడీ ఎవరో తెలుసా.. ?

 

ప్రణీత సక్సెస్ చూసి చాలా కాలమయింది. అత్తారింటికి దారేది తర్వాత ఈమెకు సరైన హిట్ రాలేదు. బ్రహ్మోత్సవం ఫ్లాప్ తో ప్రణీత కెరీర్ క్లైమాక్స్ కు చేరిందనే మాటలు వినిపించాయి. ఇక తెలుగునాట డోర్స్ క్లోజ్ అవుతోన్న టైమ్ లో ముంబయి వెళ్లిపోయింది ప్రణీత. అక్కడ రెండు సినిమాల్లో నటిస్తోంది. అయితే బాలీవుడ్ లో రెండు సినిమాలొచ్చాయి అనే ఆనందం కంటే.. ఈమెలో భయమే ఎక్కువగా కనిపిస్తోందట. 

 

ప్రణీత ప్రస్తుతం హిందీలో రెండు సినిమాల్లో నటిస్తోంది. బుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా, హంగామా 2 సినిమాలు చేస్తోంది. అయితే ఈ మూవీస్ తో బాలీవుడ్ కు వెళ్లామనే ఆనందం కంటే.. ఈ సినిమాలు అయినా ఆదుకుంటాయా అనే ఆందోళనలో ఉందట ప్రణీత. మరి ఈ మూవీస్ తో ప్రణీత కెరీర్ గట్టెక్కుతుందా.. ఈమె బాధలు తీరుస్తాయా అనేది చూడాలి. 

 

ప్రణీత కెరీర్ ప్రమాదంలో పడిపోయింది. ఆమె ఎటు వైపు అడుగులు వేయాలో అర్థం కావడం లేదు. తెలుగులో క్రేజ్ తగ్గుతున్న సమయంలో బాలీవుడ్ లో అడుగు పెట్టిన ఆమెకు రెండు అవకాశాలు అయితే వచ్చాయి. కానీ ఆమెలో సంతృప్తి కనిపించడం లేదు. ఈ సినిమాలు ఆమెను గాడిన పడేస్తాయా.. లేక తప్పిస్తాయా అర్థం కావడం లేదు. అక్కడ హిట్ గానీ దొరికితే ఆమెకు తిరుగుండదు. ఇపుడు అదే ఆమెను వెంటాడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: