సాయిపల్లవి అద్భుతమైన హీరోయిన్. ఈ అమ్మాయి డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయింది. అంతే కాదు తన నటనతో ఎక్కడ లేని జబ్బులను నయం చేస్తోంది. మానసిక ఆనందంతో పాటు శారీరక ఆరోగ్యాన్ని అందిస్తోంది.  ఏవరేజ్ బ్యూటీ అయినా ఆకట్టుకునే రూపం మన పక్కింటి అమ్మాయి అన్నంతగా ఫీలింగ్ కలిగించి తనతో పాటే కధలోకి  తీసుకెళ్ళిపోతుంది. ఓ విధంగా చెప్పాలంటే సౌందర్య తరువాత నటనతో మంచి మార్కులు కొట్టేస్తున్న హీరోయిన్ సాయిపల్లవి.

 

అటువంటి సాయిపల్లవి అంటే తెలుగు హీరోలు జడుసుకుంటున్నారుట. ఆమె నటనకు భయపడి కాదు, ఆమె పక్కన ఉంటే తమను పూర్తిగా  డామినేట్ చేస్తుందనిట. ఇక  ఆమె పాత్ర అలా ఉంటేనే ఒప్పుకుంటుందిట. దాంతో ఆటోమెటిక్ గా ఆ సినిమాలో హీరో కూడా ఆమెగానే ఉంటుంది. పక్కన ఎవరు ఉన్నారన్నది ఆడియన్స్ కి పెద్దగా పట్టదు.

 

ఇదిలా ఉంటే ఫిదా సినిమాలో సాయిపల్లవే హైలెట్. హిట్ పేరుకు వరుణ్ కి వచ్చినా కూడా సినిమా అంతా సాయిపల్లవి చుట్టూ తిరుగుతుంది. దాంతో డామినేట్ చేసిందని టాక్ వచ్చింది. ఇక ఆ తరువాత కణం సినిమా చేసింది. అందులో నాగశౌర్య  హీరో. ఆ మూవీలో సాయిపల్లవి డామినేటింగ్ రోల్ నాగ శౌర్యని కూడా ఇబ్బంది పెట్టిందట.

 

ఇపుడు సాయిపల్లవి లవ్ స్టోరీ మూవీ చేస్తోంది. ఈ మూవీలో హీరో నాగ చైతన్య. ఆయన‌కు సరైన హిట్లు లేవు. దాంతో మీడియం రేంజి హీరోగానే ఉండిపోయాడు. ఇపుడు సాయిపల్లవితో జోడీ కట్టినా కూడా ఈ మూవీలో పేరు అంతా సాయి  పల్లవికే పోతుందని అపుడే టాక్ మొదలైంది. మామూలుగానే శేఖర్ కమ్ముల మూవీలో హీరోయిన్లకు ఎక్కువ ప్రాధ్యాన్యత ఇస్తారు. దాంతో ఫిదా తరువాత మూవీ కూడా ఇక చెప్పనక్కరలేదు. ఇది పూర్తిగా సాయిపల్లవి యాంగిల్ నుంచి వచ్చే మూవీ అంటున్నారు. దాంతో హిట్ పడినా అది చైతూ ఖాతాలోకి వస్తుందా అన్న డౌట్లు వస్తున్నాయి. 

 

ఇలా సినిమా సినిమాకు సాయిపల్లవి తన డామినేటింగ్ రోల్స్ తో రెచ్చిపోతూంటే పక్కన చేసిన హీరోలు హడలిపోతున్నారు. దాంతో సాయిపల్లవి సినిమాలో హీరో అంటే సైడ్ రోలే అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: