ఈ వారం కోలీవుడ్ ఇండస్ట్రీ విశేషాలు చూసుకుంటే చాలానే ఉన్నాయి. ముఖ్యంగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ గురించి క్లారిటీ ఇవ్వడంతో రజినీకాంత్ పొలిటికల్ కెరియర్ ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో తమిళ మీడియా వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా సీఎం తాను కాకుండా వేరే ఒకరిని చేస్తాను అని చెప్పిన రజినీకాంత్ అభిప్రాయానికి చాలా మంది కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు ఫిదా అవుతుండగా మరికొంతమంది ఫీల్ అవుతున్నారు. ఇకపోతే మరో వార్త చూసుకుంటే సౌత్ ఇండస్ట్రీ లో బెస్ట్ డాన్సర్ కం హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరో గురించి విజయ్ ఫ్యాన్స్ కి మరియు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ అభిమానుల మధ్య పెద్ద డిస్కషన్ జరిగింది.

 

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో విజయ్‌ అభిమానులు...విజయ్ డ్యాన్స్ ముందు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ వేసే స్టెప్పులు పనికిరావని భారీ డిస్కషన్ పెడుతూ..ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ హీరో అంటూ విజయ్‌ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించబోయే సినిమాకు ప్రభాస్ రూ.70 కోట్ల దాకా పారితోషకం తీసుకుంటున్నాడని.. సౌత్ ఇండియాలో అతనే నంబర్ వన్ అని ఇటీవల వార్తలు రాగా.. తన కంటే విజయ్ గొప్ప అని చెప్పడానికి ‘మాస్టర్’ సినిమాకు అతను రూ.80 కోట్ల పారితోషకం తీసుకుంటున్నట్లుగా విజయ అభిమానులు విజయ్ ని ఎండోర్స్ చేస్తున్నారు.

 

అంతేకాకుండా  కరోనా వైరస్ రావటంతో తమిళ సినిమా వర్గాల నిర్మాతలు మరియు ప్రముఖులు సినిమా రిలీజ్ విషయంలో కొంత ఆలోచిస్తున్నారు. థియేటర్లో మూసేస్తే బాగుంటుంది ఒకవేళ ఇటువైపు వస్తే, అదే చేయాలి అని తమిళ సినిమా ఇండస్ట్రీ పెద్దలు డిస్కషన్స్ పెట్టుకున్నారట. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి ప్రభావం ఎక్కువ ఉండటంతో అంతర్జాతీయ స్థాయిలో కూడా సినిమాలు రిలీజ్ చేయడానికి భయపడుతున్న పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: