ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో చాలా వరకు సినిమాలు రిలీజ్ చేయటానికి భయపడుతున్నారు . చైనాలో పుట్టిన ఈ వ్యాధి ప్రస్తుతం ఇటలీలో భయంకరంగా ఉంది. ఈ వ్యాధి బారిన పడిన వాళ్ళు చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ప్రపంచ దేశాలను పరిపాలిస్తున్న నాయకులు ఈ వ్యాధి గురించి తెలుసుకుని బిక్కుబిక్కుమంటూ ఉన్నాడు . చాలా వరకు ఏ ఏ దేశాల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని ఆయా దేశాలకు సంబంధించిన ప్రజలని ఇంటిలో నుంచి బయటికి రాకూడదని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే భారతదేశంలో కూడా ఈ వ్యాధి యొక్క ప్రభావం ఎక్కువగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ముఖ్యంగా కేరళలో ఈ వైరస్ సంబంధించిన మనుషులు ఎక్కువగా ఉండటంతో...అక్కడి ప్రభుత్వం ప్రతి ఇంటికీ ఐసోలేషన్ చెకప్ దగ్గరుండి చేస్తోంది.

 

ప్రజలు ఎక్కడా కూడా గుంపులు గుంపులుగా ఉండకూడదని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ వైరస్ దెబ్బకు మాలీవుడ్ ఇండస్ట్రీ భారీస్థాయిలో నష్టపోయింది. ముఖ్యంగా ఇండస్ట్రీ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన భారీ బడ్జెట్ మూవీ 'మరక్కాల్' వాయిదా పడింది. అనుకున్న డేట్స్ ప్రకారం రిలీజ్ చేయాలా వద్దా అని సినిమా యూనిట్ ఆలోచిస్తుంది. మరో పక్క ఉన్న కొద్దీ కేరళ ప్రభుత్వంలో భయాందోళనలు ఎక్కువ అవుతున్న తరుణంలో షాపింగ్ మాల్స్ కూడా మూసేయడానికి ప్రయత్నాలు చేస్తూ ప్రజలను అలర్ట్ చేస్తుంది.

 

మొత్తంమీద చూసుకుంటే కరోనా వైరస్ దెబ్బకు దాదాపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని సినిమా ఇండస్ట్రీలో భయంకరంగా  నష్టపోతున్నాయి. దీంతో మాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ పెద్దలు అంతా ఏకమై సినిమాల రిలీజ్ విషయంలో ఎక్కువ చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క తమిళ సినిమా రంగంలో అదేవిధంగా తెలుగు సినిమా రంగంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: