మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఒక్క చాన్స్ వస్తే చాలు అనుకునే వారు ఎందరో ఉన్నారు. అలాంటిది సినిమాలో ఓ ముఖ్య పాత్ర.. సినిమాకు మూలమైన పాత్ర వస్తే కాదనేదెవరు. కానీ.. అలాంటి అవకాశాన్ని ప్రిన్స్ మహేశ్ వద్దనుకున్నాడని.. దీని వెనుక మహేశ్ ఫ్యాన్స్ ఉన్నారని ఇండస్ట్రీలో ఓ వార్త రౌండ్ అవుతోంది. ఇందులో నిజం లేదనే అంటున్నారు. సూపర్ స్టార్ కృష్ణ, మహేశ్ కి ఎప్పుడూ చిరంజీవితో మంచి అనుబంధమే ఉంది.

 

సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి ముఖ్య అతిధిగా రావడమే ఇందుకు ఉదాహరణ. రామ్ చరణ్ – మహేశ్ మధ్య మంచి స్నేహం కూడా ఉంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మహేశ్ మాట్లాడుతూ చిరంజీవి గారితో లాంగ్ రైడ్ కి వెళ్తాను.. అంటూ చెప్పడం కూడా సెన్సేషన్ క్రియేట్ అయింది. కేవలం ఈ స్నేహం కారణంగానే చిరంజీవి సినిమాలో మహేశ్ చేస్తాడని, చేయాలని లేదు. కథ మహేశ్ కి సరిపోతుందని చిరంజీవి – చరణ్ భావించడం.. మహేశ్ కు కథ నచ్చడం వల్లే ఇంతవరకూ వచ్చిందని టాక్. కాకపోతే షెడ్యూల్ ప్రారంభానికి ముందే న్యూస్ స్ప్రెడ్ కాకూడదని టీమ్ ఇంకా మహేశ్ విషయంలో గోప్యత పాటిస్తుందని ఇండస్ట్రీలో ఓ వార్త రౌండ్ అవుతోంది.

 

మహేశ్ ఈ సినిమాపై ఇంట్రెస్ట్ గా ఉన్నాడనేది ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. ఫ్యాన్స్ కారణంగా సినిమా చేయకూడదనేది మహేశ్ ఆలోచన ఫేక్ అనే అంటున్నారు. అదే నిజమైతే సరిలేరు నీకెవ్వరుకు దేవిశ్రీ ప్రసాద్ ను మ్యూజిక్ డైరక్టర్ గా వద్దని ఫ్యాన్స్ మెసెజెస్ చేసినా మహేశ్ దేవీపై నమ్మకముంచి అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఫ్యాన్స్ పై ఇలాంటి రూమర్స్ రావడం తగదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏమైనా దీనిపై అఫిషియల్ న్యూస్ రావాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: