కరోనా తో రాష్ట్రాలన్ని అతలాకుతలమవుతున్నాయి. ఎప్పుడు ఎలాంటి దురువార్త వినాలో అని జనాలు హడలి చస్తున్నారు. ఈ వైరస్ సోకకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ప్రతీ రోజు మరణ వార్త వినాల్సి వస్తుంది. అందుకే తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్లు.. కాలేజీలకు ఈ నెల 31 వరకు సెలవులను ప్రకటించింది. కరోనా విషయంలో శనివారం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం.

 

ఖమ్మం జిల్లా వాసి ఇటలీ పర్యటన అనంతరం రాష్ట్రానికి రావడం.. ఆ తర్వాతే అతనికి కరోనా పాజిటివ్ అని తేలడం తో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక గత వారం రోజులుగా చిత్ర పరిశ్రమపై కూడా కరోనా ఎఫెక్ట్ గట్టిగానే పడుతోంది. ఈ నేపథ్యంలో థియేటర్ల బంద్ ప్రకటించడం కూడా హాట్ టాపిక్ అయ్యింది. కరోనా కారణంతోనే మెగాస్టార్ చిరంజీవి కామినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ ని కూడా తాత్కాలికంగా నిలిపి వేశారు. 

 

మొత్తానికి తెలంగాణా సీఎం కేసీఆర్ ఈనెలాఖరు వరకూ థియేటర్ల బంద్ కు పిలుపునివ్వడం పరిశ్రమ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తాజా గా తీసుకున్న నిర్ణ్యాల ప్రకారం 25న రిలీజవుతున్న ఐదు సినిమాలపై కరోనా ప్రభావం బాగా పడింది. ఇప్పటికే నానీ - సుధీర్ బాబు 'వీ' సినిమాని వాయిదా వేసినట్టు అధికారికంగా చిత్రబృందం ప్రకటించింది. ఇక వరుసగా నాలుగు సినిమాలు రిలీజ్ తేదీల్ని కూడా మార్చుకుంటున్నట్లు సమాచారం.

 

ఇక ఏప్రిల్ మొదటి వారం రిలీజ్ లపై బంద్ ప్రభావం ఎంతవరకు పడుతుందో అని మేకర్స్ ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి కరోనా ఎఫెక్ట్ తో కె.సి.ఆర్ అందరూ అప్రమత్తంగా ఉండాలని అజాగ్రత్త వహించవద్దని సూచించారు. అంతేకాదు తెలంగాణా రాష్ట్ర ప్రజల పట్ల ఆందోళన చెందుతు రానున్న రోజుల్లో కరోనా ప్రభావం ఏ మేరకు ప్రభావం చూపుతుందో అని వణికిపోతున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: