ఇటీవల కొందరు సినిమా నటులపై అలానే టాలీవుడ్ పై తమకు నచ్చిన విధంగా కామెంట్స్ చేయడం అలవాటు అయిపోయింది. ముఖ్యంగా ఇటీవల లోకులు కాకులు ఆంటీ అయితే, రిలీజ్ ఆయిన ప్రతి కొత్త సినిమాకు వచ్చి తన మార్క్ మాటలతో ఆయా సినిమాల గురించి చేసే హడావుడి అంతా ఇంతా కాదనే చెప్పాలి. వాస్తవానికి మొదట్లో ఆమె చిత్ర విచిత్రమైన మాటలకు అందరూ కూడా ఆమెను ఎగబడి చూసేవారు. అయితే ఆ తరువాత ఆమెకు మానసికంగా ఒక వ్యాధి ఉండడంతోనే ఆమె ఆ విధంగా మాట్లాడుతోంది అని తెలుసుకున్న అనంతరం, చాలా మంది ప్రేక్షకులు ఆమెపై జాలి చూపించసాగారు. అయితే ఆమె ఇప్పటికీ కూడా అక్కడక్కడ కొన్ని సినిమాలకు తన మార్క్ రివ్యూ లు ఇస్తూనే ఉంది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, ఇటీవల సునిసిత్ అనే వ్యక్తి పలు మీడియా చానల్స్ ఇంటర్వ్యూ ల్లో మాట్లాడుతూ, మన టాలీవుడ్ అగ్రహీరోలైన సూపర్ స్టార్ మహేష్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ రాజా రవితేజ, రెబల్ స్టార్ ప్రభాస్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ల పై సంచలన కామెంట్స్ చేసాడు. 

 

అతడు మాట్లాడుతూ, తనకు టాలీవుడ్ లో ఇటీవల చాలా అవకాశాలు వచ్చాయని, ముందుగా మహేష్ సుకుమార్వన్ నేనొక్కడినే సినిమా తనదేనని, తొలుత తనతో కొన్ని సీన్స్ కూడా తీసిన సుకుమార్, ఆ తరువాత మహేష్ బాబు, కాల్ చేసి ఆ సినిమా తాను నటిస్తానని చెప్పడంతో, తనని తీసేసి మహేష్ ని హీరో గా పెట్టి సినిమా తీశారని ఆశ్చర్యకరంగా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే అది మాత్రమే కాదు, ఆ తరువాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నాన్నకు ప్రేమతో, అలానే రవితేజ హీరోగా వచ్చిన బలుపు, ఆపై రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన సాహో సినిమాల్లో కూడా తానే హీరోనని, అయితే ఆయా సినిమాల దర్శకులు తనని మోసం చేసి ఆ సినిమాల నుండి తప్పించి, స్టార్ హీరోలతో సినిమాలు తీయడం జరిగిందని అన్నాడు. అది మాత్రమే కాక హీరోయిన్ లావణ్య త్రిపాఠితో తాను ప్రేమలో ఉన్నానని, అలానే ఫేమస్ యాంకర్ మాచిరాజు ప్రదీప్ వైఖరి తనకు నచ్చకపోవడంతో అతడిపై కేసు కూడా పెట్టానని అతడు వెల్లడించాడు. 

 

ఇక తనతో సినిమాలు చేయనీయకుండా ఆపేసిన సుకుమార్ వంటికొందరు  దర్శకులు తనకు కొంత మొత్తం డబ్బు ఇచ్చి దానిని కప్పిపుచ్చినట్లు అతడు చెప్పుకొచ్చాడు. అయితే మొత్తంగా అతడి వ్యాఖ్యలు విన్న ప్రజలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. ఇక అతడి ఇంటర్వ్యూ ల్లో స్పష్టంగా అతడు అబద్దాలు చెప్తున్నాడని ప్రతి ఒక్కరికీ అర్థం అవుతుంది. అయితే అతడికి కొంత మతి చలించిందని, అందుకే అలా మాట్లాడుతున్నాడని మరికొందరు అంటున్నారు. అయితే ఇతడిని చూస్తుంటే, ఈయన ముందు లోకులు కాకులు ఆంటీ కూడా దిగదుడుపని, అయితే మొదట్లో అతడి వాఖ్యలు వింటే స్టార్ హీరోలు సైతం షాక్ అవుతారని, అయితే పూర్తిగా అతడి మాటలు విన్న తరువాత మాత్రం అతడికి లోలోపల ఏదో ఇంటెన్షన్ ఉందని, అందుకే ఇలా మాట్లాడుతున్నాడని పలువురు నెటిజన్లు తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు..... !!  

మరింత సమాచారం తెలుసుకోండి: