ఒకప్పుడు స్వర్గీయ కోడీ రామకృష్ణ దర్శకత్వంలో అందాల నటి అనుష్క నటించిన ‘అరుంథతి’ మూవీ గుర్తుంది కదా.. ఈ మూవీలో సోనూ సూద్ ఓక పగతో రగిలిపోయిన అఘోరాగా భయంకర రూపంతో కనిపిస్తాడు.  బొమ్మాళీ నిన్ను వదలా.. అంటూ కొట్టే డైలాగ్స్ థియేటర్లో మారుమోగాయి. అప్పట్లో ఇదో గ్రాఫిక్ మాయాజాలంగా ప్రేక్షకులను అలరించింది.  తాజాగా ప్రేమ్ ఆర్య‌న్ ద‌ర్శ‌కత్వంలో ఆరువంద‌ల ఏళ్ల క్రితం జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల‌కు కాల్ప‌నిక సంఘ‌ట‌న‌ల జోడించి తెర‌పైకి తీసుకొస్తున్నసోషియో  ఫాంట‌సీ చిత్రం `అంగుళీక‌` రూపొందుతుంది.  

 

ఓ భయంకరమైన మాంత్రికుడు మళ్లీ జన్మ ఎత్తితే ఎంతటి ప్రళయం వచ్చి పడుతుందో తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతుంది. ఈ మూవీ శ్రీ శంఖు చ‌క్ర ఫిలింస్ బ్యాన‌ర్‌పై కోటి తూముల‌, ఎ.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వ‌ర‌లోవిడుద‌ల కాబోతోంది. తాజాగా ఈ మూవీ గురించి నిర్మాత మాట్లాడుతూ.. ద‌ర్శ‌కుడు ప్రేమ్ ఆర్య‌న్ బాలీవుడ్ సినిమాలకు గ్రాఫిక్స్ అందించే విభాగంలో ప‌నిచేసిన అనుభ‌వంతో ఈ సినిమాను ఒక విజువ‌ల్ వండ‌ర్‌గా తీర్చి దిద్దాడు. స్క్రీన్‌ప్లే స‌రికొత్త‌గా వుంటుంది. మ‌న‌కు ఏడు ర‌కాల సూర్య గ్ర‌హ‌ణాలుంటాయి. అందులో ఒక సూర్య గ్ర‌హ‌ణం అంగుళీక ఆకారంలో వుంటుంది.

 

సూర్య భ‌గ‌వానుడి అంశ‌లో పుట్టిన ఓ అమ్మాయికి అంగుళీక సూర్య గ్ర‌హానికి సంబంధం వుంటుంది. ఆ లింకేంటి? అన్న‌దే ఈ సినిమా అన్నారు  కోటీ తూములు. ఈ మూవీలో  దీప‌క్‌, శేఖ‌ర్ వ‌ర్మ‌, వివ్య‌శాన్త్ హీరో హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు.  ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం గ్రాఫిక్స్ మూవీస్ కి మంచి ఆదరణ లభిస్తుంది.   ఈ నేపథ్యంలో అంగుళీక చిన్నా, పెద్దలను అలరిస్తుందని అంటున్నారు చిత్ర యూనిట్. ఇక ట్రైలర్ చూస్తుంటే నిజంగా సరికొత్త గ్రాఫిక్ మంత్రంలా కనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: