ప్రపంచాన్ని దారుణంగా పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు మనుషుల ప్రాణాలు మాత్రమే కాదు.. వాణిజ్య వ్యవస్థను కూడా కష్టాల్లోకి నెట్టుతుంది.  ప్రపంచంలోనే అతి పెద్ద దేశం వ్యాపార క్రయ విక్రయాలు జరిపించే చైనా లోని పుహాను లో పుట్టిన ఈ కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్లో విస్తరించి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.  కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థకు చిక్కులు వచ్చి పడ్తున్నారు. స్టాక్ మార్కెెట్ నిట్ట నిలువునా పడిపోతుంది.. లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుంది.  ఇక ప్రపంచంలో ఎన్ని కష్టాలు ఉన్నా.. మనిషిక కాస్త సేదతీరేది సినీరంగంతో.. కానీ ఇప్పుడు ఈ సినీ ప్రపంచాన్ని కూడా శాసిస్తుంది కరోనా. 

 

హాలీవుడ్ లో జేమ్స్ బాండ్ బిగ్గెస్ట్ మూవీ చాలా కాలం పాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ ఒక్క మూవీనే కాదు ఎన్నో చిన్నా, పెద్ద సినిమాలు వాయిదాలు వేసుకుంటున్నారు.  స్టార్ హీరోలు ఇతర దేశాల్లో జరిగే షూటింగ్ క్యాన్సల్ చేసుకుంటున్నారు.  ప్రాణాల కన్నా సినిమాలు ముఖ్యం కాదని అంటున్నారు. అంతే కాదు మాల్స్, థియేటర్లు అన్ని నిరవదికంగా మూసి వేస్తున్నారు.  దాంతో ఇప్పటికే పూర్తయిన సినిమాలు రిలీజ్ చేసే దిక్కులేకుండా పోయింది.  ఇప్పటికే రిలీజ్ అయిన మూవీస్ చూసే మానవుడు లేకుండా పోతున్నారు.  దాంతో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన నిర్మాతలకు బైండ్ బ్లాక్ అవుతుంది. రోజురోజుకీ కరోనా కేసులు అధికం అవుతుండటంతో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 

ఇంటి నుంచి బయటికి వస్తుంటే మాస్క్ లేకుండా రాలేకపోతున్నారు. ఇప్పుడు ప్రభుత్వమే రావద్దని చెబుతుంది. ఈ ప్రభావం టాలీవుడ్‌పై దారుణంగా పడుతుంది. ఇప్పటికే కోట్ల రూపాయలు నష్టపోతున్నారు నిర్మాతలు. అనుకోకుండా వచ్చిన ఈ కరోనా మహమ్మారితో చిన్న నిర్మాతలు రోడ్డున పడుతున్నారు.పెద్ద నిర్మాతలకు కూడా వడ్డీల రూపంలో కోట్ల నష్టం వస్తుంది.  ఇలా అయితే కొన్నాళ్లకు సినీ పరిశ్రమ మరింత కష్టాల్లో పడుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: