టాలీవుడ్ లో మెగాస్టార్ చరంజీవి-కొరటాల కాంబినేషన్ లో వస్తున్న ‘ఆచార్య’ మూవీ షూటింగ్ షరవేగంగా సాగుతుంది.  ఈ మూవీలో మెగాస్టార్ దేావాలయాల్లో జరుగుతున్న అక్రమాలపై పోరాడే ఓ ప్రొఫెసర్ పాత్రలో కనిపిస్తారని కొంత కాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి.  అంతే కాదు ఆయన మాజీ నక్సల్ గా కనిపిస్తారని.. ఆయనతో పాటు మొన్నటి వరకు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కనిపించబోతున్నారని వార్తలు వచ్చాయి.  అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు.  ప్రస్తుతం ప్రజల కరోనా భయంతో వణికి పోతున్నారు.  ఇప్పటికే పలు సినిమా షూటింగ్స్ వాయిదా పడుతున్న విషయం తెలిసిందే.  ఇక కరోనా భయంతో ప్రభుత్వాలు పాఠశాలలు, థియేటర్లు, మాల్స్, బార్లు, క్లబ్బులు అన్నీ మూసి వేస్తున్నారు.  

 

ఈ నేపథ్యంలో  మెగాస్టార్ చిరంజీవి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు.  సామాజిక బాధ్యత తనకు ఉందని.. ప్రస్తుతం కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని..మ‌హ‌మ్మారి నియంత్ర‌ణ ప్ర‌తీ ఒక్క‌రి బాధ్య‌త అని, దీని నివార‌ణ బాధ్య‌త‌ను ప్రభుత్వానికే వ‌దిలేయ‌కుండా ప్ర‌జ‌లంతా భాగ‌స్వాములు కావాల‌ని మెగాస్టార్ చిరంజీవి ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌లంద‌రినీ కోరుతున్నారు. త‌న వంతు బాధ్య‌త‌గా త‌న సినిమా షూటింగ్‌ని వాయిదా వేస్తున్నానని ప్ర‌క‌టించారు.

 

క‌రోనా నియంత్ర‌ణ‌కు కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు అవ‌లంభిస్తున్న విధానాల ప‌ట్ల ఆయ‌న హ‌ర్షం వ్య‌క్తం చేశారు. సినిమా షూటింగ్‌ల‌లో కూడా పెద్ద సంఖ్య‌లో టెక్నీషియ‌న్స్ ప‌నిచేయాల్సి ఉంద‌ని, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 10 నుండి 15 రోజుల వ‌ర‌కు షూటింగ్‌లు వాయిదా వేస్తే మంచిద‌ని భావిస్తున్నాన‌న్నారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ జ‌రుగుతున్న త‌న సినిమా వాయిదా వేద్దామ‌ని కొర‌టాల శివ‌తో అన్న‌ప్పుడు ఆయ‌న వెంట‌నే స‌రే అన్నారు. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం కన్నా ఏదీ ముఖ్యమైనది కాదు.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాట్లు చిరు అన్నారు. దీనికి అంతా స‌హ‌క‌రిస్తార‌ని ఆశిస్తున్నాను  అన్నారు చిరంజీవి.

మరింత సమాచారం తెలుసుకోండి: