హాలీవుడ్ సినీ పరిశ్రమను కూడా కరోనా వైరస్‌ భయపెడుతోంది. వినోద రంగాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న కరోనా కారణంగా చాలా సినిమాల షూటింగ్‌ లు రిలీజ్ లు వాయిదా పడుతున్నాయి. భారీ అంచనాల మధ్య రిలీజ్‌ కావాల్సిన హాలీవుడ్‌ సినిమాలు వరుసగా వాయిదా పడుతున్నాయి. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యూనివర్సల్‌ పిక్చర్స్‌ ఫాస్ట్ అండ్‌ ఫ్యూరియస్‌ 9 సినిమాను ఏకంగా ఏడాది పాటు వాయిదా వేసింది.

 

సోనీ సంస్థ కూడా మార్చి 27 న రిలీజ్‌ కావాల్సిన పీటర్‌ రాబిట్ 2 సినిమాను ఆగస్టుకు పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇక బాండ్‌ సిరీస్‌ లో రిలీజ్‌ అవుతున్న నో టైం టూ డై సినిమా కూడా వాయిదా పడింది. ఎంజీఎం, యూనివర్సల్‌, ఇయాన్‌ సంస్థను ముందుగా ఏప్రిల్‌ లోనే రిలీజ్ చేయాలని భావించారు. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ సినిమాను నవంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా వెల్లడించారు.

 

డిస్నీ సంస్థ మాత్రం ఏప్రిల్ 24న రిలీజ్ కావాల్సిన బ్లాక్‌ విడో సినిమా షెడ్యూల్‌ ప్రకారం రిలీజ్ అవుతుందని తెలిపింది. కానీ అదే సంస్థలో రిలీజ్‌ కావాల్సిన మరో సినిమా ములాన్‌ను వాయిదా వేశారు. ఇక ఈ వారం హాలీవుడ్ ఇండస్ట్రీకి కుదిపేసిన మరో వార్త హాలీవుడ్‌ హీరోక అతని భార్యకు కరోనా పాజిటివ్‌ అన్న న్యూస్‌.

 

హాలీవుడ్‌ సీనియర్ హీరో టామ్‌ హ్యాంక్స్ తనకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్టుగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రకటించాడు.  ప్రస్తుతం ఈ స్టార్‌ హీరో ఓ బయోపిక్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో టామ్‌ మ్యూజిక్‌ లెజెండ్‌ ఎల్విస్‌ పెర్సలీ వద్ద చాలా కాలం మేనేజర్‌ గా పరిచేసిన కొలోనెల్ టామ్‌ పార్కర్‌ పాత్రలో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: