ప్రస్థుతం కరోనా ప్రపంచంలోని అందర్నీ భయపెడుతున్న పరిస్థితులలో మన ఇండియాలో షూటింగ్ లు చేయడానికి కూడ మన స్టార్స్ భయపడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులలో కరోనా గురించి ఆలోచించకుండా ధైర్యంగా యూరప్ లోని జార్జియా కు వెళ్ళడమే కాకుండా అక్కడి 10 డిగ్రీల చలిని జోరున కురుస్తున్న వర్షాన్ని లెక్క చేయకుండా ప్రభాస్ తన లేటెస్ట్ మూవీ కోసం చేస్తున్న యాక్షన్ సీన్స్ అదేవిధంగా ఛేజింగ్ సీన్స్ కు సంబంధించిన వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలోని చాలామందిని ఆశ్చర్య పరుస్తున్నాయి. 


యూరప్ అంతా కరోనా భయాలతో వణికిపోతు ఉంటే పూజ హెగ్డే తో అక్కడ రొమాంటిక్ సీన్స్ లో ప్రభాస్ నటిస్తున్నాడు. షూటింగ్ గ్యాప్ లలో మాత్రం మాస్క్ ధరిస్తూ షూటింగ్ ప్రారంభం కాగానే షూటింగ్ తన మాస్క్ తీసివేసి అందర్నీ ఉత్సాహ పరుస్తూ జోక్స్ వేయడమే కాకుండా కరోనా గురించి ఆలోచనలు ఎవరికీ రాకుండా ప్రభాస్ చాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టాక్. 


ఈ సినిమాను ఎత్తి పరిస్థితులలోను ఈ ఏడాది దసరా సీజన్ కు విడుదల చేసి తీరాలి అన్న పట్టుదలతో కరోనా భయాలతో యుద్ధం చేస్తూ ప్రభాస్ పడుతున్న కష్టాలను చూస్తుంటే అతడు నిజమైన ‘బాహుబలి’ అని అనిపించడం సహజం. ఇది ఇలా ఉంటే ఈ మూవీలో మరో కీలక పాత్రను చేస్తున్న పెళ్ళి చూపుల ఫేమ్ ప్రియదర్శిమూవీ షూటింగ్ కోసం జార్జియా వెళ్ళడానికి మూడు ఫ్లైట్స్ మారి జార్జియా చేరుకున్న తరువాత కనీసం తనకు ఒక్క పూట కూడా రెస్ట్ ఇవ్వకుండా ఈ మూవీ కోసం ప్రభాస్ పరుగులు తీస్తూ ప్రియదర్శి పూజ హెగ్డే లను కూడ పరుగులు తీయిస్తున్నట్లు టాక్. 


ఇది ఇలా ఉండగా ప్రభాస్ తన యూనిట్ సభ్యుల క్షేమం కోసం తన టీమ్ లో ప్రత్యేకంగా హైదరాబాద్ నుండి ఒక డాక్టర్ ను తీసుకు వెళ్ళాడు అని వార్తలు రావడం బట్టి ప్రభాస్ కరోనా కు భయపడకుండా ఎలా సినిమా పూర్తి చేస్తున్నాడో అర్ధం అవుతుంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: