ఒకప్పుడు వివాదాలు అంటే ఎవరైనా ఎవరినైనా ఉద్దేశించి బహిరంగంగా మాట్లాడటమే. కానీ ఇప్పుడు వివాదం అంటే పెట్టిన ట్విట్లలోనో.. లేకపోతే ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పోస్టుకు ఓల్గార్ కామెంట్ రావడమో... ఇలా ఏవో పిచ్చివి వస్తే తప్ప అవి వివాదాలు అని తెలియదు. వీళ్ళు రియాక్ట్ అవుతే తప్ప అది వివాదంగా మారదు.. ఇకపోతే ఈ వారం వివాదం తెచ్చిన ట్విట్లు ఏవో ఇక్కడ చదివి తెలుసుకుందాం.

 

నాగబాబు ట్విట్.. 

 

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎంత వేడిగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి స్థానిక ఎన్నికల్లో నామినేషన్స్ వేసేకి వచ్చిన ఓ అభ్యర్థిని కొందరు అడ్డుకోవడం వాళ్ళు ఎదురు నిల్చోడం అంత ఓ వీడియోలో వచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోను జనసేన పార్టీ నేత నాగబాబు ట్వీట్ చేసి.. ''అది పౌరుషం అంటే వైఎస్సార్‌సీపీ వారి గూండాగిరికి నిలబడ్డ పెద్దాయన అంటూ ప్రశంసలు కురిపించారు. ఈ పెద్దాయన గురించి కొందరు ఆరా తీశారట. పుంగనూరు నియోజకవర్గానికి చెందిన అంజిరెడ్డిగా గుర్తించారట. ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీచేసేందుకు వస్తే కొందరు అడ్డుకున్నారని తెలుస్తోంది.'' అంటూ ట్విట్ చేశారు.. ఈ ట్విట్ ఓ రకంగా వివాదానికి కొని తీసుకొచ్చింది అనే చెప్పాలి.  

 

 

రష్మీ గౌతమ్.. 

 

హోలీ సందర్భంగా రష్మీ ట్విట్ చేస్తూ.. ''హోలీ పండగ నాడు కుక్కలపై రంగులు చల్లకండి అంటూ కామెంట్ చేసింది. మనపై రంగు పడితే సబ్బుతో కడిగేస్తాం.. కానీ జంతువులు ఆ పని చేయలేవు'' అని రష్మీ ట్వీట్ చేసింది. అయితే ఆ ట్విట్ లో ఎలాంటి తప్పు లేదు. కానీ ఆ ట్విట్ చుసిన ఓ నెటిజన్ స్పందిస్తూ.. ''అచ్చా.. పండగలు పబ్బాలు వచ్చినపుడే మీకు ఇలాంటివి గుర్తుకు వస్తాయా ?  మన పండగల విశిష్ఠతను తగ్గించేలా ఇలాంటి సందేశాలు ఇస్తున్నారా'' అని కౌంటర్ వేసాడు. అయితే ఈ కామెంట్ చుసిన రష్మీకి కోపం వచ్చి అంతే ఘాటుగా స్పందించింది. ''నాపై ఇలాంటి పోస్ట్‌లు పెట్టే ముందు ఇంతకు ముందు నేను పోస్ట్ చేసిన వాటిని నా పేజీలో చెక్ చేయండి'' అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.

 

 

హ్యారీ పోటర్ హీరోకి కరోనా.. 

 

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంత వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ''హ్యారీపోటర్‌ యాక్టర్ డేనియల్‌ ర్యాడ్‌క్లిఫ్‌కు కూడా వైరస్ సోకినట్లు.. అది బీబీసీ బ్రేకింగ్ న్యూస్ ట్విట్ చెయ్యడం'' వంటి వార్తలు రావడం అందరిని షాక్ కి గురి చేసింది. కానీ ఆ ట్విట్ లో ఎంత మాత్రం నిజం లేదు.. కానీ ఆ ట్విట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తీరా చూస్తే ఆ ట్విట్ ఫేక్ అని తేలింది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: