గత కొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న మ్యాచో హీరో గోపించంద్ ప్రస్తుతం మినిమం గ్యారెంటీ  డైరెక్టర్ సంపత్ నంది డైరెక్షన్ లో సీటీమార్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. గత కొన్ని నెలలుగా నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో గోపిచంద్ తోపాటు హీరోయిన్  తమన్నా కూడా పాల్గొంటుంది. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈచిత్రంలో సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా అలాగే యువ హీరోయిన్ దిగంగన సూర్యవంశీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమా టీజర్ విడుదలకానుంది. 
 
ఇక  ఈచిత్రంలో తమన్నా, జ్వాలా రెడ్డి పాత్రలో తెలంగాణ టీం కు కబడ్డీ కోచ్ గా కనిపించనుండగా ఆంధ్రా కబడ్డీ టీం కు కోచ్ గా గోపిచంద్ నటిస్తున్నాడు. అంతేకాదు మొదటి సారి ఈ సినిమా కోసం తమన్నా తెలంగాణ యాసలో డైలాగులు చెప్పనుంది. క్లైమాక్స్  ఈ సినిమా కు హైలైట్ కానుందని సమాచారం. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై యూ టర్న్ నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈచిత్రం మే లో విడుదలకానుంది. ఈ చిత్రం పై గోపిచంద్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈ సారైనా హిట్ కొట్టి గోపిచంద్ ట్రాక్ లోకి వస్తాడో లేదో చూడాలి.
 
ఇదిలావుంటే గోపిచంద్ - సంపత్ నంది కాంబినేషన్ లో ఇది రెండో సినిమా. ఇంతకుముందు వీరి కాంబో లో వచ్చిన గౌతమ్ నంద ఆశించినఫలితాన్ని ఇవ్వలేదు.  ఇక సీటీమార్ తరువాత గోపిచంద్, తేజ తో సినిమా  చేయనున్నాడని సమాచారం. త్వరలోనే ఆ సినిమా లాంచ్ కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: