టీవీ షోలతో బిజీ బిజీగా ఉంటుంది అనసూయ. ఈ అమ్మడికి క్రేజ్ తెచ్చిన టీవీ షో అంటే జబర్దస్త్ అనే చెప్పాలి. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. ప్రస్తుతం అనసూయ భరద్వాజ్ ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోతో పాటు పలు ఛానళ్లలో కూడా షోలు చేసుకుంటుంది.

 

 

 ప్రస్తుతం ఆమె బిజీ బిజీ అయిపోయింది. ముఖ్యంగా చెప్పాలంటే.. అన్ని ఛానెల్స్‌ లో తన హవా చూపిస్తోంది. ఈటీవీలో జబర్దస్త్ కామెడీ షో, మా టీవీలో ఓక షో, జెమినిలో ఇప్పుడు తల్లా పెళ్లామా అనే షో, జీ తెలుగులో లోకల్ గ్యాంగ్స్ ఇలా అన్నింట్లోనూ నేనున్నానంటూ..తనన మార్క్ ను వేసుకుంటూ పోతోంది అనసూయ.  మరోవైపు సినిమాలు కూడా చేస్తుంది ఈ హాట్ యాంకర్. రెండు చేతులా బాగానే సంపాదిస్తుంది అనసూయ.

 

 

 

టీవీ షోలతో బిజీ బిజీగా ఉన్నా కూడా అప్పుడప్పుడూ వెండి తెరపైన కనిపించి ఆమె నటనతో అందర్ని ఆకట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. అనసూయ తన టాలెంట్ ను చూపిస్తూ నాకెవ్వరు సాటిలేరని ఇన్ డైరెక్ట్ గా చెబుతోంది. ఎక్స్ట్రా జబర్దస్త్ చేస్తున్న రష్మీ కూడా అనసూయకు గట్టి కాంపిటీషన్ ఇస్తుందనే చెప్పాలి. సూటిగా చెప్పాలంటే.. రష్మీ కూడా అనసూయకు గట్టి పోటీ ఇస్తూ.. తాను కూడా ఈ జబర్దస్త్ ఏ కాక ఢీ షో చేస్తోంది. ఈషోతో ఈమెకు క్రేజ్ అమాంతం పెరిగిపోయిందని చెప్పాలి. షోలో రష్మీ కి సుధీర్ కి ఎఫైర్ అని కామెంట్స్ ఇలాంటివి మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. 

 

 

కానీ.. రష్మీ, శ్రీముఖి ఇలా యాంకర్స్ ఎవరున్నా కూడా వీళ్ళతో పోలిస్తే  అనసూయకు ఎక్కువ క్రేజ్ ఉందని చెప్పుకోవచ్చు. అనసూయ కొన్ని షోలలో జడ్జిగా కూడా వ్యవహరించారు. అనసూయ మాత్రం నాకు నీనే సాటి.. నాకెవ్వారు సాటి లేరని చెప్తూ.. ఆమె టాలెంట్ తో దూసుకుపోతోంది. ఏది ఏమైనా ఇలానే తన నవ్వుతో, అభినయంతో, అమాయకత్వంతో, టాలెంట్ తో ముందుకు సాగాలని కోరుకుందాం..

మరింత సమాచారం తెలుసుకోండి: