జెజ‌మ్మ‌గా, భాగ‌మ‌తిగా, దేవ‌సేన‌గా ఏ పాత్ర‌కైనా అందులో ఇమిడిపోయి న‌టించ‌డంలో త‌న‌కు త‌నే సాటి. త‌నే స్వీటీ. స్వీటీ అన్న పేరు ఎంత అందంగా ఉందో ఆమె అందం, మ‌న‌సు కూడా అంతే అందంగా ఉంటుంది. ఇక ఆమె అస‌లు పేరు స్వీటీ అయితే... ఆమెకు మ‌న తెలుగు ఇండ‌స్ట్రీ పెట్టిన పేరు అనుష్క‌. అందం అభిన‌యం ఆమెకు పెట్టింది పేరు అని చెప్పాలి. ఇటీవ‌లె ఆమె 15 ఏళ్ళ సినీ కెరియ‌ర్ పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా మీడియాతో ముచ్చ‌టించిన కొన్ని విశేషాలు ఇప్పుడు ఇక్క‌డ చూద్దాం...


చాలా గ్యాప్ త‌ర్వాత రావ‌డానికి కార‌ణం...
‘బాహుబలి, రుద్రమదేవి’ చిత్రాలు కొంత యాక్ష‌న్ సీక్వెన్స్‌తో కూడుకున్న‌వి కాబ‌ట్టి ఆ సినిమాలు శారీరకంగా చాలా కష్టంతో కూడుకున్నవి. ఆ షూటింగ్‌ సమయాల్లో నాకు కొంత గాయాలు అయ్యాయి. అందుకే ఆ గాయాలు మానడానికి బ్రేక్‌ తీసుకున్నాను.

 

15 ఏళ్లు కెరియ‌ర్ ఎలా ఉంది...
15 ఏళ్లు ఎలా గడిచాయో నాకే తెలియడం లేదు. అయితే ఆ పదిహేనేళ్లదే ప్రపంచం కాదు. మనకి మనం కూడా కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. రియాలిటీ చెక్‌ చేసుకోవాలి. అందుకే ఇప్పటినుంచి కొంత బ్రేక్ తీసుకునే రావాల‌నుకుంటున్నా.

 

 బ్రేక్‌లో బరువు కూడా త‌గ్గారా...
మెల్లిగా తగ్గుతూ వస్తున్నాను. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బరువు తగ్గుతున్నాను. లావు, సన్నం, తెలుపు, నలుపు.. ఇలా చాలా మంది బాహ్య సౌందర్యానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లనిపిస్తోంది. ఒకప్పుడు ఆరోగ్యంగా ఉన్నారా... అని అడిగేవారు. ఇప్పుడు అలాంటి వారు క‌రువ‌య్యారు. కేవ‌లం సన్న‌బ‌డ్డావా.. న‌ల్ల‌గ‌య్యావా ఇలా ఫిజిక‌ల్ అపియ‌రెన్స్‌కి ఎక్కువ ప్రాధాన్య‌త నిస్తున్నారు.

 


 ‘నిశ్శబ్దం’లో మూగ, చెవిటి అమ్మాయిగా నటిస్తున్నారు...వరుస చాలెంజింగ్‌ రోల్స్‌ చేయడం గురించి...
‘నిశ్శబ్దం’ కథను కోన వెంకట్‌గారు చెప్పగానే ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో నాకు ఎదురైన పెద్ద చాలెంజ్‌ ఏంటంటే తెలుగులో డైలాగ్స్‌ ఎలా చెప్పాలి అని. నాకు అప్ప‌ట్లో తెలుగే వ‌చ్చేది కాదు. అందులో డైలాగులు... ఇప్పుడు డైలాగ్స్‌ లేకుండా నటించాను (నవ్వుతూ).  ఈ పాత్ర కోసం సైన్‌ లాంగ్వేజ్‌ నేర్చుకున్నాను. అమెరికన్‌ సైన్‌ లాంగ్వేజ్‌నేర్చుకుని చేశాం.

 

మీ పెళ్ళి ఎప్పుడు దాని గురించి వివ‌రాలు...
అవునా.. నాకు పెళ్లి అంటున్నారా. నాక్కూడా తెలియదు (నవ్వుతూ). ప్రేమ అయినా పెళ్లి లాంటివి ప‌ర్స‌న‌ల్ విష‌యాల గురించి ఇలా చ‌ర్చించ‌డం అనేది స‌మంజ‌సం కాదు.ఒకవేళ నేను ఏద‌న్నా రిలేషన్‌షిప్‌లో ఉంటే దాన్ని సీక్రెట్‌గా దాచను. ఇక‌ పదేళ్ల నుంచి ప్రతీ మూడు నాలుగు నెలలకోసారి నాకు పెళ్లి చేస్తూనే ఉన్నారు. నేను వింటూనే ఉన్నాను. నేను పెద్ద‌గా న్యూస్ చ‌దివే అల‌వాటు లేదు. నాకు ఎవ‌రో చెపితే తెలుస్తుంది. క్రికెటర్‌ని పెళ్లి చేసుకుంటున్నట్టు వచ్చిన వార్తను దర్శకుడు హేమంత్‌ చెప్పారు. అప్పుడెలా రియాక్ట్‌  కావాలో అర్థం కాలేదు. వార్త‌ల‌ను క‌ల్పించి రాసేవాళ్లకూ ఫ్యామిలీ ఉంటుంది. రాసేట‌ప్పుడు కాస్త ఆలోచించి రాస్తే బావుంటుంద‌ని నా ఫీలింగ్‌.

 

 ‘సాహో’లో మిమల్ని ఒక స్పెషల్‌ సాంగ్‌ చేయమన్నారా...
అడిగారు. అప్పుడు నేను అమెరికాలో షూటింగ్‌ చేస్తున్నాను. షెడ్యూల్‌ కుదర్లేదు.


మీ త‌ర్వాత ప్రాజెక్ట్స్‌...
 గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయబోతున్నాను. ఓ రెండు స్క్రిప్ట్స్‌ చర్చల దశలో ఉన్నాయి. వాటి గురించి ఆలోచించాలి. జూన్‌ నుంచి షూటింగ్  మొదల‌వుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: