తెలుగు చిత్ర పరిశ్రమలో అనుష్కా కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ అమ్మడు... మొదటి సినిమాతోనే ఎంతో మందిని ఆకర్షించింది. ఇక ఆ తర్వాత వరుస అవకాశాలతో చేజిక్కించుకుంటూ  స్టార్ హీరోయిన్ గా  మారిపోయింది. కానీ సైజ్ జీరో అనే ప్రయోగాత్మక సినిమా చేసిన తర్వాత ఈ అమ్మడికి అవకాశాలు తగ్గిపోయాయి. ఎందుకంటే అందరినీ ఆకర్షించే అందం కాస్త... లావుగా అవడంతో ఎవరు సినిమాలో అవకాశం ఇవ్వలేదు. దీంతో సినిమా సినిమాకి ఎంతో గ్యాప్ తీసుకుంది  ఈ ముద్దుగుమ్మ. ఒకప్పుడు గ్లామర్ పాత్రల్లో  అలరించిన అనుష్క. ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలో నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ అదరగొడుతోంది. 

 

 

 అయితే అనుష్క తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై పదిహేనేళ్లు అయినప్పటికీ కూడా అనుష్క క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికి ఎంతో మంది అభిమానులు అనుష్కను ఆరాధిస్తూనే ఉన్నారు. ఈ పదిహేనేళ్ల కాలంలో ఎంతోమంది కొత్త హీరోయిన్లు వచ్చారు పోయారు కానీ... అనుష్క క్రేజ్ మాత్రం అలాగే ఉండిపోయింది. ప్రస్తుతం ఎన్నో వైవిధ్య ఆత్మ కథలు ఎంచుకుంటూ దూసుకుపోతుంది అనుష్క. బాహుబలి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత... భాగమతి అనే డిఫరెంట్ కాన్సెప్ట్  సినిమాతో తెరపైకి వచ్చి తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది ఈ ముద్దుగుమ్మ. 

 

 

 ఇక ఇప్పుడు నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే అనుష్క అందాల ఆరబోత చేయకున్నప్పటికీ అభిమానులు మాత్రం అనుష్కను ఆదరిస్తూ నే ఉన్నారు. ప్రస్తుతం సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న నిశ్శబ్దం సినిమాలో అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తుండగా ఈ సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగిన విషయం తెలిసిందే. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో పదిహేనేళ్లు దాటిపోనప్పటికీ... ఇప్పటికీ తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న అనుష్క ఈ వారం స్టార్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: