విజయ్ దేవరకొండ ప్రజెంట్ టాలీవుడ్ లో హాట్ కేక్ లా సేల్ అయ్యే హీరో. అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ హీరో.. ఆ తర్వాత వచ్చిన గీతగోవిందం, టాక్సీవాలా,  డియర్ కామ్రేడ్,  సినిమాలతో తనక్రేజ్ ని మరింత పెంచుకున్నాడు. అందుకే బాలీవుడ్ వాళ్లుకూడా  వెంటపడి ఆఫర్ ఇచ్చి దగ్గరుండి మరీ సినిమా చేయించుకుంటున్నారు. 

 

విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్ తో సినిమా చేస్తున్నాడు. అదికూడా కరన్ జోహార్ ప్రొడక్షన్స్ లో. అసలు బాలీవుడ్ ఎందుకుభయ్యా.. చక్కగా తెలుగు సినిమాలు చేసుకోక అని ఓ టైమ్ లోఅన్న విజయ్ ని దగ్గరుండి మరీ హిందీ  సినిమాల వైపు తీసుకెళ్లాడు కరణ్ జోహార్ .  ఫస్ట్ నుంచి  విజయ్ మీద కాన్సన్ ట్రేట్ చేస్తూనే ఉన్నకరణ్ ఇప్పుడు విజయ్ కి బంపర్ ఆఫర్ ఇచ్చాడు.

 

విజయ్ దేవరకొండకు  కరణ్ జోహార్  100 కోట్ల సూపర్ ఆఫర్ ఇచ్చాడట. బాలీవుడ్ లో కూడా విజయ్ కు మంచి క్రేజ్ ఉండడంతో  పిలిచినప్పుడు వచ్చి సినిమా చేసి వెళ్లేలా ..దానికి సంవత్సరానికి 100 కోట్లు ఇచ్చేలా డీల్ కుదుర్చుకున్నాడట విజయ్ దేవరకొండ. తెలుగులో  ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నా హిందీలో సినిమా చేసేలా కండిషన్  కూడా ఉందని టాక్.  

 

విజయ్ దేవరకొండ రీసెంట్ గా క్రాంతిమాధవ్ తో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రిలీజ్ చేశాడు. కానీ అది అనుకున్నంత హిట్ అవ్వలేదు . అందుకే ఆల్రెడీ స్టార్ట్ చేసిన సినిమాలను పక్కన పెట్టేసి అర్జెంటుగా హిట్ కోసం పూరీ తో సినిమా స్టార్ట్ చేశాడు విజయ్. ఈ హీరోకి ప్యాన్ ఇండియా ఇమేజ్ కోసం కరణ్ జోహార్ ఇన్వాల్వ్ అయ్యి ఈ ఫైటర్ ని బాలీవుడ్ కి కూడా తీసుకెళ్లాడు. ఇలా కరణ్ ఇచ్చిన  100 కోట్ల డీల్ కనుక ఓకే అయితే ఇక తెలుగులో సినిమాలు తగ్గించేసి బాలీవుడ్ మీదే కాన్సన్ ట్రేట్ చేస్తాడని టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: