టాలీవుడ్ లో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హవా నడుస్తుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న తారక్ ప్రస్తుత౦ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ట్రిపుల్ ఆర్ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఏ ఇబ్బందులు లేకుండా విడుదల చేసేందుకు గాను చిత్ర యూనిట్ గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. టాలీవుడ్ లో ప్రస్తుతం ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది. దాదాపు అందరు హీరోలు ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

 

ఇది పక్కన పెడితే, ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల అవుతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర గురించి ఇప్పుడు ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. అతనిని అరవింద సమేత సినిమాలో త్రివిక్రమ్ పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా చూపించలేకపోయాడు. అయితే ఈ సినిమాలో అతన్ని చూపించే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. ప్రస్తుత౦ త్రివిక్రమ్ ఈ పాత్ర కోసం కాస్త గట్టిగానే కష్టపడుతున్నాడు. 

 

ఎన్టీఆర్ ని ఎలా చూపించాలి అనే దానిపై తన సన్నిహితుడు అయిన బాలీవుడ్ దర్శకుడుతో కూడా చర్చలు జరుపుతున్నాడు. ప్రస్తుతం ఈ లుక్ ని ఫైనల్ చేసే పనిలో పడ్డాడు. ఇక ఈ సినిమాలో తారక్ ని... ముఖ్యమంత్రిగా చూపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇందుకోసం ఒక ప్రత్యేక సెట్ ని వేసి ముఖ్యమంత్రి పాత్రను ఆ సెట్ లోనే పూర్తి చెయ్యాలని, ఒక చోటే ఉండి అతను ప్రజల్లోకి వెళ్ళకుండా పరిపాలిస్తూ ఉంటాడని, మొదటి భాగం అంతా ఇలాగే సాగుతుందని, తర్వాతి భాగంలో మాత్ర౦ అతను ప్రజల్లో ఉండే విధంగా షూట్ చేస్తారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: