ప్రస్తుతం రాజమౌళి పూన పేరు చెపితే హడిలి పోతున్నాడు. కొన్ని నెలల క్రితం పూనా లో ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి కొన్ని యాక్షన్ సీన్స్ తీయాలని రాజమౌళి తన టీమ్ తో సహా పూనా వెళ్ళి షూటింగ్ మొదలు పెట్టే సమయంలో చరణ్ కాలికి గాయం కావడంతో ఆ షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టకుండానే తిరిగి హైదరాబాద్ వచ్చేసాడు. 


ఇప్పుడు మళ్ళీ రాజమౌళి కొంత గ్యాప్ తీసుకుని పూనా లో కనిపించే అలనాటి బ్రిటీష్ కాలాన్ని ప్రతిబింబించే కొన్ని భవంతులను సెట్ చేసుకని అక్కడ కొన్ని వేలమంది మధ్య అల్లూరి సీతారామరాజు పాత్రను చేస్తున్న రామ్ చరణ్ పై కొన్ని యాక్షన్ సీన్స్ ను తీయాలని షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా భయంతో జనం విపరీతంగా గుమికూడే ఫంక్షన్స్ ఆఖరికి పెళ్ళిళ్ళు కూడ క్యాన్సిల్ చేసిన పరిస్థుతులలో ఇప్పుడు పూనా లో రాజమౌళికి షూటింగ్ నిమిత్తం ఇచ్చిన పర్మిషన్స్ రద్దు అయ్యాయి అని తెలుస్తోంది. 


ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో బ్రిటీష్ సైనికులు లా నటించడానికి కొందరు నిజమైన బ్రిటన్ దేశానికి చెందిన చిన్న నటీనటులను రాజమౌళి ఎంపిక చేసాడు. ఇప్పుడు విదేశాల నుండి ఇండియాకు వచ్చే వారికి వీసా సమస్యలు ఏర్పడటంతో రాజమౌళి ప్లాన్ ప్రకారం ఆ బ్రిటీష్ ఎక్స్ ట్రా ఆర్టిస్టులు ఇప్పట్లో వచ్చే ఆస్కారం లేదు అని అంటున్నారు. 


ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో జూనియర్ పక్కన హీరోయిన్ గా నటిస్తున్న ఒలివియా మోరిస్ ఇప్పుడు ఇండియాకు వచ్చి షూటింగ్ లో పాల్గొనడమంటే భయపడిపోతోంది అని టాక్. దీనితో రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ కు కూడ కరోనా కష్టాలు వెంటాడుతూ అతని ప్లాన్స్ అన్నీ నష్టపెడుతోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. దీనితో చిన్న సినిమాల నుండి ‘ఆర్ ఆర్ ఆర్’ లాంటి భారీ సినిమాల వరకు ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరికీ కరోనా కష్టాలే..  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: