పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి ఎందరో హీరోయిన్లు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఆయనతో ఒక్క అవకాశం వచ్చినా చాలని అనుకుంటారు. సినిమా హిట్ ఫ్లాప్ అనే సంబంధం లేకుండా ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకి వస్తుంది. రాజకీయాలను పక్కన పెట్టి మరీ పవన్ కళ్యాణ్ ఈ సినిమాను చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. తొలి పాటను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. 

 

మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పాట ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరూ అనేది ఖరారు కాలేదు. ముందు శృతి హాసన్ అనుకున్నారు. ఆ తర్వాత ఆమె కాదని మరొకరికి అవకాశం ఇస్తారని కీర్తి సురేష్ కి అవకాశం ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది. కాని అది నిజం కాదని తెలిసింది. ఇప్పుడు మరో హీరోయిన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. దీని మీద చిత్ర యూనిట్ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న మాజీ స్టార్ హీరోయిన్, ఇలియానా ప్రయత్నాలు చేస్తుంది అంటున్నారు. 

 

ఇలియానా గతంలో పవన్ కళ్యాణ్ తో జల్సా సినిమాలో నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. దీనితో ఈ సినిమాలో నటించడానికి ఆమె ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవల హైదరాబాద్ వచ్చిన ఆమె పవన్ కళ్యాణ్ ని కలిసినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా స్పందించారు అంటున్నారు. త్వరలోనే ఆమెతో దర్శక నిర్మాతలు చర్చలు జరిపి ఖరారు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా తెలుగులో సినిమాలు చెయ్యాలి అనుకోవడం మాత్రం ఆశ్చర్యమే.

మరింత సమాచారం తెలుసుకోండి: