ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అనేది పాత సామెతను.. ‘సుబ్బి చావు ఎంకి పెళ్లికి దారితీసింది’ అని తిరగేసి కొత్తగా రాసుకోవాలేమో. టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పరిస్థితి ఇలానే ఉంది. దేశాన్ని కుదిపేస్తోన్న కరోనా ఎఫెక్ట్ పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ముందు జాగ్రత్త చర్యగా ఏకంగా మార్చి 31వరకూ మాల్స్, సినిమా ధియేటర్స్, పబ్స్, పార్క్స్.. ఇలా ప్రతీ వినోదాన్ని బ్యాన్ చేసింది. ఈ నిర్ణయమే ఇప్పుడు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు కలిసొచ్చింది.

 

 

వెంటనే తన మాస్టర్ బ్రెయిన్ కు పదును పెట్టాడు. తాను ఆమధ్య లాంచ్ చేసిన ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాను రంగంలోకి దించాడు. వరుస సినిమాలను వదులుతున్నాడు. అసలే ఎంటర్ టైన్మెంట్ ను బాగా ఇష్టపడే మన తెలుగు ప్రజలు ఇప్పుడు ఆన్ లైన్ స్ట్రీమింగ్ కు మొగ్గు చూపుతారనడంలో సందేహం లేదు. దీనినే మన మెగా ప్రొడ్యూసర్ క్యాష్ చేసుకుంటున్నాడు. దేశమంతా కరోనా అల్లకల్లోలం చేసేస్తున్న ఈ సమయంలో ఎక్కడ చూసినా హై అలర్ట్ కనిపిస్తోంది. వినోదం మాట దేవుడెరుగు.. కనీసం నలుగురు గుమిగూడే సమూహాల ప్రదేశాలకు కూడా నిషేధాజ్ఞలు వచ్చేశాయి. దీంతో ఖచ్చితంగా ఆన్ లైన్ సినిమాలకు డిమాండ్ ఉంటుంది.

 

 

తన ఆహాలో.. ఖైదీ, అర్జున్ సురవరం, ప్రెషర్ కుక్కర్, చూసీ చూడగానే, నెపోలియన్, దేవ్, కథనం, సూర్యకాంతం.. వంటి సినిమాలను వదిలాడు. ఎలా లేదన్నా ప్రేక్షకులు వినోదాన్ని వదులుకోలేరు. దేన్ని వదులుకున్నా తప్పని సరిగా వదులుకోనిది సినిమానే. దీంతో ఆహాకు మంచి ప్రాచుర్యం, లాభం గ్యారంటీగా కలిసొస్తాయి. దీంతో కరోనా ఎఫెక్ట్ అందరినీ భయపెడుతూంటే అల్లు అరవింద్ ను మాత్రం సంతోష పెడుతోందని అంటున్నారు. త్వరలోనే ఆహాకు బన్నీ చేస్తున్న ప్రమోషన్ కూడా రానుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: