ఈ ఏడాది తో పాటు రాబోయే ఏడాదిలో కూడా రాబోతున్న కొన్ని భారీ సినిమాలకోసం ప్రేక్షకుల ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి అవి ఏవేవో ఇప్పుడు చూద్దాం...!!

IHG

'ఆర్ఆర్ఆర్' - టాలీవుడ్ దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో తొలిసారిగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. అతి పెద్ద హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మితం అవుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ కి చెందిన పలువురు నటీనటులు నటిస్తుండడం విశేషం. కాగా ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 8న ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్...!!

IHG

పవన్, క్రిష్ మూవీ - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల గ్యాప్ తరువాత ప్రస్తుతం నటిస్తున్న సినిమా వకీల్ సాబ్. ఈ ఏడాది వేసవి కానుకగా మేలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. అయితే దానితో పాటు క్రిష్ దర్శకత్వంలో కూడా పవన్ మరొక సినిమాలో నటిస్తున్నారు. పాన్ ఇండియా ఫీల్ తో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ మూవీ లో పవన్ ఒక గజదొంగ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనపడుతోంది....!!

IHG

నో టైం టూ డై - ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన మొతం 24 జేమ్స్ బాండ్ సినిమాల్లో దాదాపుగా చాలా సినిమాలు మంచి సక్సెస్ ని అందుకున్నాయి. ఇక ఆ సిరీస్ లో భాగంగా రాబోతున్న ప్రతిష్టాత్మక 25వ సినిమా నో టైం టూ డై. మరొకసారి ఈ సినిమాలో కూడా బాండ్ పాత్రలో డ్యానియల్ క్రెయిగ్ నటిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కానుండగా, కరోనా వైరస్ ఎఫెక్ట్ తో సినిమాని నవంబర్ కు తీసుకెళ్లారు సినిమా యూనిట్...!!

IHG

అవతార్ 2 - జేమ్స్ క్యామరూన్ దర్శకత్వంలో కొన్నేళ్ల క్రితం వచ్చిన అవతార్ సినిమా ప్రపంచంలోనే అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాగా గొప్ప రికార్డు ని సృష్టించింది. ఇక ప్రస్తుతం దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న అవతార్ 2 సినిమాని వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది....!!

IHG

భారతీయుడు 2 - ప్రముఖ నటుడు కమల్ హాసన్, దర్శక దిగ్గజం శంకర్ ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భారతీయుడు 2. కొన్నేళ్ల క్రితం వీరిద్దరి కాంబోలో వచ్చిన భారతీయుడు అతి పెద్ద విజయాన్ని అందుకుంది. ఇటీవల ప్రారంభం అయిన ఈ సినిమా షూటింగ్ లో పెద్ద ప్రమాదం జరిగి ముగ్గురు యూనిట్ సభ్యులు చనిపోయారు. ప్రస్తుతం మళ్ళి షూటింగ్ ప్రారంభం అయిన ఈ సినిమాని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు....!!

IHG

కెజిఎఫ్ - 2 : కన్నడ నటుడు యాష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ ల కాంబోలో తెరకెక్కిన కెజిఎఫ్ 1 కు సీక్వెల్ గా ప్రస్తుతం తెరకెక్కుతున్న కెజిఎఫ్ 2 సినిమాపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. భారీ ఖర్చుతో, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కొందరు బాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని అక్టోబర్ 23న రిలీజ్ చేయనున్నారు...!!

IHG

క్రిష్ 4 - బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ హీరోగా కొన్నేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కోయి మిల్ గయా, క్రిష్, క్రిష్ 3 సినిమాలకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న నాలుగవ సినిమా క్రిష్ 4. ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.....!!

IHG

83 - ప్రముఖ ఇండియన్ క్రికెటర్ కపిల్ దేవ్ జీవిత చరిత్ర  ఆధారంగా,1983లో ఇండియా వరల్డ్ కప్ ని గెలుచుకున్న ఘట్టాన్ని ఆధారంగా చేసుకుని 83 సినిమాని ఎంతో అద్భుతంగా తెరెక్కిస్తున్నారు. కపిల్ పాత్రలో రణ్వీర్ సింగ్ నటిస్తుండగా, ఆయన భార్య పాత్రలో దీపికా పడుకొనే నటిస్తున్నారు. కాగా ఈ సినిమా, వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: