ఏదైనా ఒక వార్త వస్తే అది అన్నీ రంగాలతో పాటుగా సినీ రంగం పై కూడా ప్రభావాన్ని చూపుతుందన్న సంగతి తెలిసిందే.కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నా నేపథ్యంలో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. చైనా లో ప్రబలిన ఈ వైరస్ ప్రభావం ఇప్పుడు భారత్ ను కదిలించి వేస్తుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు కరోనా పాజిటివ్ కేసులుకు కూడా నమోదు అయ్యాయి. 

 

 


ఈ మేరకు సినీ తారలు కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎవరికీ తగ్గట్లు వాళ్ళు చెబుతూ వస్తున్నారు. అయితే ఈ కరోనా ప్రభావంతో పలు వాణిజ్య వ్యాపారాలు మూతపడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కరోనా సినిమాలపై తన ప్రభావాన్ని చూపుతుంది. ఈ మేరకు ఈ నెలలో విడుదల కానున్న సినిమాలు వాయిదా పడిన విషయం తెలిసిందే.. 

 

 


కాగా, తాజాగా సినిమా థియేటర్లను మూసివేతపై మరో సారి నిర్మాతమండలి  ఫిలిం ఛాంబర్లో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ కరోనా ఎఫెక్ట్ మాత్రం సినిమా రంగం పై బాగా పడింది. ఉగాది పండగ సందర్భంగా విడుదల కావాల్సిన నాని చిత్రం 'వి' వాయిదా పడగా, రాష్ట్రంలోని సినిమా హాల్స్ అన్నింటినీ ఈ నెలాఖరు వరకూ మూసి వేయాలని కేసీఆర్ సర్కారు ఆదేశించినట్లు సమాచారం. 

 

 

 

తాజాగా, సమావేశమైన టాలీవుడ్ నిర్మాతల మండలి, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, ప్రభుత్వ ఆదేశాలను పాటించేందుకు సిద్ధమేనని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రజల శ్రేయస్సు దృష్ట్యా సినిమాల విడుదలను వాయిదా వేయనున్నట్లు చర్చలు జరిపారని సమాచారం.. అయితే తెలంగాణ నిర్ణయాన్ని సమర్దిస్తున్నామని తాజాగా అజరిగిన సామవేశాల్లో వెల్లడించారు. అయితే మరో రెండు మూడు వారాల వరకు థియేటర్లు బ్యాండ్ చేసినట్లే తెలుస్తుంది. థియేటర్లు మూసివేస్తే నష్టం వాటిల్లు తున్నదని యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేస్తుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: