ప్రస్తుతం తరం అంత సోషల్ మీడియాకు అతుక్కుపోయి ఉంది. అందుకే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వచ్చే వార్తలే ఎక్కువ హాల్ చల్ చేస్తున్నాయి. ఇక పోతే సోషల్ మీడియాలో ప్రముఖులంతా కూడా ట్విట్స్ పెడుతూ ఉంటారు.. అలాంటి కొన్ని ట్విట్స్ లో ఈ వారం ఏ ట్విట్స్ బాగా ట్రెండ్ అయ్యాయో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. 

 

 

ఆనంద్ మహింద్రా ట్విట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే ఈయన ఈ వారంలో కరోనా వైరస్ పై ట్విట్ చేసి మీడియా దృష్టిని తన వైపు సారించాడు. అసలు ఎం అని ట్విట్ చేశాడు అంటే? ''నా మిత్రుడు అశోక్ కురియన్ మాస్క్‌లు పంపించారు. నా అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుత కరోనా కాలంలో ఇంత కంటే మంచి గిఫ్ట్ ఇంకొకటి ఉండదు. ఓ భారతీయుడి స్విస్ కంపెనీ ఈ కొత్త మాస్క్‌లతో ముందుకొచ్చినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. మళ్లీ మళ్లీ వినియోగించుకునే అవకాశం ఉన్న ఈ వాషబుల్ మాస్క్‌లు వైరస్‌లను నాశనం చేస్తాయి. కంపెనీ వారు భారత్‌లో వీటి ఉత్పత్తిని వేగవంతం చేస్తున్నారు.’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్విట్ కూడా ఎప్పటిలాగే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

 

 

గత శుక్రవారం కవితక్కా పుట్టిన రోజు కావడంతో తన అన్న.. తెలంగాణ మంత్రి కేటీఆర్ కవితక్కా కోసం ఓ స్పెషల్ ట్వీట్ చేశారు. ఆ స్పెషల్ ట్విట్ ఎం అని అంటే? ''హ్యాపీ బర్త్ డే పప్.. నీ జీవితంలో సంతోషం నిండాలని, మంచి ఆయురారోగ్యాలు, సుఖ:శాంతులు ఉండేలా దీవెనలు లభించాలని కోరుకుంటున్నా'' అంటూ కవిత చిన్నప్పటి ముద్దు పేరుతో కేటీఆర్ ట్వీట్ చేస్తూ పుట్టిన రోజు శుభాకంక్షలు తెలిపారు. ఈ ట్వీట్‌కు కవిత స్పందిస్తూ.. ''థాంక్యూ అన్నయ్య'' అంటూ ట్విట్ చేసి వార్తల్లో నిలిచారు. 

 

IHG

 

చంద్రబాబు సుపుత్రుడు నారా లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అయన మీడియా ముందు వచ్చి అనర్గళంగా మాట్లాడలేరు.. అందుకే ట్విట్స్ పెట్టి మేనేజ్ చేస్తున్నారు. సరే ఆ ట్విట్స్ అయినా సరిగ్గా చేస్తాడా? అంటే అది లేదు. ఒకొక్కసారి అనిపిస్తుంది.. అయన చేసే ట్విట్స్ ఆయనకు అయినా అర్థం అవుతాయా అని. 

 

ఇకపోతే సీఎం జగన్ ఇప్పటికే త‌న పార్టీ త‌ర‌పున బీసీల‌కు ప‌ది శాతం రిజ‌ర్వేష‌న్లు పెంచి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో టికెట్లు కేటాయిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇందుకు అనుగుణంగానే బీసీల‌కు వైసీపీ 34 శాతం రిజ‌ర్వేష‌న్ ప్రాతిప‌దిక‌న టికెట్లు కేటాయించింది. కానీ నారా లోకేష్ ఎం ట్విట్ చేశారు అంటే? 

 

''సీఎం జగన్‌ మంచి కటింగ్ మాస్టర్ అని వ్యాఖ్యానించారు. చట్టబద్ధ‌గా బీసీలు అనుభవిస్తున్న 34 శాతం రిజర్వేషన్లను 10 శాతం కట్ చేసి 24 శాతానికి తగ్గించారన్నారు. రాజకీయంగానూ, సామాజికంగానూ, ఆర్థికంగానూ బీసీలను దెబ్బతీస్తూ రిజర్వేషన్లు పార్టీపరంగా అమలు చేస్తున్నామని కటింగ్ ఇస్తున్నారంటూ'' లోకేశ్‌ ట్వీట్ చేశారు. ఈ ట్విట్ చుసిన నెటిజన్లు.. నీ ట్విట్స్ నీకు అయినా అర్ధం అవుతున్నాయా? అని ప్రశ్నలు వేస్తున్నారు. ఈ పిచ్చి ట్విట్ కూడా వార్తల్లో బాగానే వైరల్ అయ్యింది అని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: