రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండి, రాజకీయంగా బిజీ అయిపోయిన జనసేనాని ఇపుడు, కొంతకాలం రాజకీయానికి విరామం ప్రకటించి, జెట్ స్పీడుతో సినిమాలు చేస్తున్నాడు. ఒకేసారి మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇప్పటికే రెండు సినిమాలు సెట్స్‌ మీదికి వెళ్లిపోయాయి. అందులో ‘వకీల్ సాబ్’ చిత్రీకరణ చివరి దశకు చేరుకోగా... మరోవైపు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చేస్తోన్న సినిమా కూడా షూటింగ్ జరుపుకుంటోంది. క్రిష్ దర్శకత్వంలో చేస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే బోలెడన్ని కథనాలు సోషల్ మీడియా లో నడుస్తున్నాయి.

 

ఇది ఒక పిరియాడికల్ డ్రామా అని, తెలంగాణ చరిత్రలో మరుగున పడిపోయిన ఓ పోరాట యోధుడి కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని ఆ మధ్య ప్రచారం జరిగింది. ఇపుడు కొత్తగా.. రాబిన్ హుడ్ తరహా పాత్ర పవన్ కళ్యాణ్ చేస్తున్నారంటూ.. అభిమానులు చెబుతున్నారు... ఇక  వీటిలో నిజమెంతో తెలీదు కానీ.. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి లీకైన పవన్ పిక్ మాత్రం, ఇప్పటి వరకు వచ్చిన వార్తలకు కొంచెం సింక్ అయేలా వుంది.

 

IHG

 

ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్ నుదిటిన పొడవాటి ఎర్ర బొట్టు పెట్టుకుని ఉండటం మనం గమనించవచ్చు. ఇక ఆయన కళ్లు చాలా గంభీరంగా ఎంతో రౌద్రంగా కనిపిస్తున్నాయి. దీంతో ఇది ఖచ్చితంగా ఒక పీరియాడిక్ సినిమా అవుతుందనే భావన సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. ‘వకీల్ సాబ్’ సినిమా విషయంలో కూడా ఇలానే లీకులు జరగడం మనం చూసాం. ఇప్పుడు కూడా లీకుల పరంపర కొనసాగడం దురదృష్టకరం... ఏది ఏమైనా అది పవన్ కళ్యాణ్ చరిష్మా ముందు తుడుచుపెట్టుకు పోవలసిందే.

 

గతంలో ఆయన చేసిన ఒక సినిమా రిలీజుకి ముందే 50 శాతం లీకైనప్పటికీ, అతని విజయాన్ని అది ఆపలేకపోయింది. అది ఒకింత పబ్లిసిటీగా మారిపోయింది. ఇపుడు జరుగుతున్న పరిణామాలు కూడా అలాగే పునరావృతం అవుతాయని అభిమానులు ఒకింత నమ్మకంతో వున్నారు. పవన్ కళ్యాణ్ ఖుషి నిర్మాత ఎ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం ఇక్కడ విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: