టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్ కాజల్ హవా లేకపోయినా సరే ఆమె మాత్రం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఆమె గురించి ఏదోక వార్త వస్తూనే ఉంటుంది. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధ౦ లేకుండా కాజల్ ఇప్పుడు ఆఫర్లు దక్కించుకుంటుంది. అటు తమిళంలో కూడా ఆమెకు క్రేజ్ పర్వాలేదు అనే చెప్పవచ్చు. ప్రస్తుతం కాజల్ ముందు రెండు సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు చేసిన తర్వాత ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని ఆమె కథలు కూడా వినడం లేదని అంటున్నారు. 

 

ఆమె హీరోయిన్ గా అడుగు పెట్టి 15 ఏళ్ళు దాటింది. ఇటీవల ఆమె నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. దీనితో ఆమె పరిస్థితి ఏంటీ అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత౦ ఈమె పెళ్లి గురించి టాలీవుడ్ లో చర్చలు బాగానే జరుగుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరో ఒకరిని ఆమె ప్రేమించింది అని కొందరు అంటే కాదు అని మరికొందరు అంటున్నారు. ఇక ఇప్పుడు ఆమె గురించి ఒక వార్త బయటకు వచ్చింది. ఆమె క్రికెటర్ ని పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. టాలీవుడ్ లో ఆమెకు క్రేజ్ తగ్గింది. 

 

దీనితో ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసి పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని ఎప్పుడైనా హీరో అక్కగానో చెల్లి గానో ఆఫర్లు వస్తే చెయ్యాలని ఒక నిర్ణయానికి వచ్చింది అంటున్నారు. ప్రస్తుతం ఆమె ఆ క్రికెటర్ తో డేటింగ్ లో ఉందని కూడా ప్రచారం ఎక్కువగానే జరుగుతుంది. మొన్నీ మధ్య అనుష్క విషయంలో కూడా ఇదే విధంగా ప్రచారం జరిగింది. అనుష్క ఆ ప్రచారాన్ని కొట్టి పారేసింది. ఇప్పుడు కాజల్ విషయంలో కూడా అలాగే వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: