ప్ర‌పంచ వ్యాప్తంగా అంద‌రినీ వ‌ణికిం చేస్తున్న ప్రాణాంత‌క వ్యాధి క‌రోనా వ‌ల్ల చాలా న‌ష్టం జ‌రుగుతోంది. ఇటు సినీ ఇండ‌స్ట్రీ అంతా అల్ల‌క‌ల్లోలంగా మారింది. మూకుమ్మ‌డిగా ఎక్క‌డా జ‌నాలు ఉండాలంటేనే భ‌య‌ప‌డుతున్నారు. అందుకు ప్ర‌ధాన‌కార‌ణం క‌రోనా గాలి ద్వారా వ్యాపించే ఓ అంటు వ్యాధి కావ‌డ‌మే. అయితే ఇటీవ‌లె చిత్ర  షూటింగ్‌ల‌న్నీ కూడా వాయిదా వేసేస్తున్నారు. ప్ర‌స్తుతం చిరంజీవి కొర‌టాల చిత్రం  ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే మ‌రి ఆ చిత్రం కూడా వాయిదా ప‌డ‌గా. ఇప్పుడు అక్కినేని నాగార్జున న‌టిస్తున్న వైల్డ్ డాగ్ కూడా వాయిదా వేసిన‌ట్లు స‌మాచారం.

 

ఇక ఈ  కొరోనా వైరస్ వ్యాధి రోజురోజుకి అంతకంతకూ పెరుగుతూ ప్రపంచం మొత్తాని భయపెడుతున్న విష‌యం తెలిసిందే. దీంతో ప్ర‌భుత్వాలు ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి. ఎక్కువ‌గా జ‌న‌సాంధ్ర‌త ఉన్న ప్ర‌దేశాల‌కు వెళ్ళ‌వ‌ద్ద‌ని అలాగే మాల్స్‌, స్కూల్స్‌, సినిమా థియేట‌ర్ల సైతం బంద్ చేయిస్తున్నారు. దీంతో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న సినిమా షూటింగ్‌ల‌న్నీ కూడా ఆపివేయ‌డం జ‌రుగుతుంది. జనజీవనం అస్తవ్యస్థం అవుతుంది. మ‌రి   ముఖ్యంగా వరల్డ్ వైడ్ గా చిత్ర పరిశ్రమ కుదేలవుతుంది. కొత్త సినిమాల విడుదల మరియు షూటింగ్ షెడ్యూల్స్ ఆగిపోయాయి. కాగా నాగార్జున ఈ నేప‌ధ్యంలోనే నూతన చిత్రం వైల్డ్ డాగ్ షూటింగ్ కూడా ఆపివేసినట్టు తెలుస్తుంది.

 

కింగ్ నాగార్జున హీరోగా తెరక్కుతున్న తాజా చిత్రం వైల్డ్ డాగ్. అశుతోష్ సోలొమన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున ఎన్‌కౌంట‌ర్ స్పెషలిస్ట్ మరియు ఎన్ ఐ ఏ అధికారి విజయ్ వర్మ అనే రోల్ చేస్తున్నారు. కాగా ఈ చిత్ర షూటింగ్ రెండు వారాలు ఆపేయాలని నాగార్జున నిర్ణయించారట. కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టే పనిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మ‌రి పెద్ద హీరోలంద‌రూ ఈ వ్యాధిని ఎలాగైనా స‌రే అరిక‌ట్టాల‌ని త‌మ సినిమాల‌ను సైతం ప‌క్క‌న పెట్టి న‌డుం బిగించార‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: