టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకరు. దాదాపు అందరు అగ్ర హీరోలతో ఆయన సినిమాలు చేసారు. అందులో హీరోల కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన సినిమాలు ఉన్నాయి. సినిమా హిట్ ఫ్లాప్ అనే సంబంధం లేకుండా సినిమాలు చేయడం అనేది పూరి స్టైల్. ప్రస్తుతం అతను కెరీర్ లో కాస్త ఎక్కువగానే ఇబ్బంది పడుతున్నారు. పూరి సినిమాలు అంటే ఒకరకమైన క్రేజ్ ఉండేది అప్పట్లో. కాని అది ఇప్పుడు మాత్రం కాస్త తగ్గింది. అతని సినిమాల మీద ఇప్పుడు ఆసక్తి తగ్గింది అభిమానులకు. అతని సినిమా వస్తుంది అంటే ఎదురు చూసిన వాళ్ళు ఇప్పుడు వెనక్కు తగ్గుతున్నారు.

 

దీనికి కారణం ఏంటో తెలియదు గాని ఆయన మాత్రం ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ ఒక సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత చేసే సినిమా కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒక స్టార్ హీరోతో సినిమా చెయ్యాలని చూస్తున్నాడు. కాని ఆ స్టార్ హీరో మాత్రం పూరి సినిమా అయితే వద్దని అంటున్నారట. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని పూరి క్రేజ్ తగ్గడమే దానికి కారణమని చెప్తున్నారు. పూరి జగన్నాథ్ కథలను అభిమానులు పెద్దగా ఇష్టపడే పరిస్థితి ఎక్కడా కనపడటం లేదు. 

 

గతంలో ఆయన కథల్లో ఉండే పట్టు ఇప్పుడు కనపడటం లేదు. దీనితో స్టార్ హీరోలు నీ కథ అయితే అవసరం లేదని వేరే కథ అయితే తమకు చేయడానికి ఇబ్బంది లేదని చెప్తున్నారట. దీనితో పూరి జగన్నాథ్ తనకు.. టెంపర్ సినిమా కథ ఇచ్చిన వక్కంతం వంశీ తో చర్చలు జరుపుతున్నాడని సమాచారం. ఒక సినిమా కథను పూరి విన్నాడని ఆ కథను ఆ స్టార్ హీరోకి కూడా వినిపించే ప్రయత్నం చేస్తున్నాడని, అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆ సినిమాను మొదలుపెట్టే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: