వయసు కరిగిపోతుంది. సొగసు కూడా జారిపోతుంది. మనసు ఒక్కటే నిలిచిపోతుంది అంటారు మనసు కవులు. కానీ వయసు శాశ్వతం అనుకుంటారు సుందరాంగులు. దానికి ఎప్పటికపుడు పదును పెడుతూ ఎదపైన మదనుడి బాణాలు వేసేందుకు రెడీ గా ఉంటారు.

 

దీనికి అచ్చమైన ఉదాహరణగా కాజల్ అగర్వాల్ ని చెప్పుకోవాలి. కాజల్ వయసు మూడున్నర పదులు. కానీ ఆమె ఎప్పటికీ పదహారు అణాలా భామగా ఉంటుంది. కాజల్  చందమామ ట్యాగ్ ని ఎప్పటికపుడు నిలబెట్టుకుంటే వస్తోంది. మగధీరలో యువరాణి అందాలను అలా వెన్నెల వన్నెలతో అందిస్తూనే ఉంది.

 

లేటెస్ట్ గా కాజల్ కి సినిమాలు ఏవీ లేవు. వచ్చిన సినిమాలకు కూడా భారీ రెమ్యునరేషన్ చెప్పేసి కాజల్ తిప్పికొడుతోంది. తనకు పెద్ద  హిట్ ఇచ్చిన తేజాకే అలా చుక్కలు చూపించింది. అయితే ఈ మధ్య హఠాత్తుగా కాజల్ పేరు మళ్ళీ బయటకు వచ్చింది. అదే మెగా క్యాంప్ నుంచి త్రిష తప్పుకోవడంతో కాజల్ కి చాన్స్ వచ్చింది.

 

దాంతో మెగాస్టార్ తో మరోసారి జతకట్టి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశాన్ని కాజల్ కొట్టేసింది. ఇదిలా ఉంటే కాజల్ ఈ సినిమాకు భారీ పారితోషికమే డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. మరి సీనియర్లకు హీరోయిన్లు దొరకడంలేదు. దాంతో కాజల్ అడిగిన దానికి ఓకే చెప్పారని భోగట్టా.

 

బహుశా ఈ అనందమో మరేమో తెలియదు కానీ కాజల్ లేటెస్ట్ గా హాట్ ఫోజులతో సోషల్ మీడియాలో కుర్రకారుని కిర్రెక్కించే పిక్స్ పెట్టేసింది. కంప్లీట్ నాచురల్ గా కాజల్ కనిపిస్తోంది. పైగా బికినీతో అందాలను ఒలికిస్తూ పెట్టిన పిక్స్ కాజల్ అందం చెక్కుచెదరలేదు అనుకునేలా ఉందిట. మొత్తానికి ఇటు రెమ్యునరేషన్ తో పాటు అందంతో కూడా కాజల్ తాను ఎప్పటికీ డిమాండ్  ఉన్న చిన్నదాన్నే అనిపించుకుంటోంది. మరి చూసేయడమే ఆ జోరుని, హుషార్ ని.

 

మరింత సమాచారం తెలుసుకోండి: